హైదరాబాద్ : కాంగ్రెస్ నేత న్యాయయాత్ర

Vijaya


పాలమూరు జిల్లా సమగ్రాభివృద్ధికి న్యాయయాత్ర చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వంశీచంద్ రెడ్డి నిర్ణయించారు. ఇందుకోసం జనవరి 31వ తేదీన మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణగ్రామంలోని క్షీరలింగేశ్వరస్వామి మఠంను వేదికగా నిర్ణయించుకున్నారు. రాహుల్ గాంధి చేస్తున్న భారత్ జోడో న్యాయ యాత్ర స్పూర్తితో వంశీ కూడా పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వంశీ తన పాదయాత్రకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు.





వంశీ నిర్ణయంలో నాలుగు పాయింట్లున్నాయి. మొదటిదేమిటంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పార్టీని తన లోక్ సభ నియోజకవర్గం పరిధిలో బాగా యాక్టివేట్ చేయటం. పార్లమెంటు ఎన్నికలు మరో మూడునెలల్లో ఉందనగా కాంగ్రెస్ పార్టీ నేత ఆధ్వర్యంలో పాదయాత్ర మొదలైతే లోకల్ లీడర్లందరు తప్పక పాదం కలుపుతారనటంలో సందేహంలేదు. ఈ రకంగా పార్లమెంటు పరిధిలోని ఎంఎల్ఏలు, నేతలు, పోటీ చేయాలని ఆశపడుతున్న వాళ్ళంతా ఉత్సాహంగా పాల్గొంటారు. దానివల్ల పార్టీ జనాల్లోనే కొన్నిరోజులు ఉండటానికి అవకాశం దక్కుతుంది.





ఇక రెండో కారణం ఏమిటంటే కేసీయార్ పదేళ్ళ పాలనలో జిల్లాలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పటానికి ఉపయోగపడుతుంది. కేసీయార్ పాలనలో జిల్లాకు జరిగిన అన్యాయం, వెనకబాటుతనం లాంటి అనేక నెగిటివ్ కోణాలను జనాలకు గ్రామస్ధాయిలో ఎత్తిచూపించవచ్చు. ఇక మూడోకోణం ఏమిటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలవ్వబోయే అభివృద్ధి, సంక్షేమపథకాలపై జనాలకు భరోసా ఇచ్చినట్లుంటుంది. పైగా అధికారంలోకి రాగానే సిక్స్ గ్యారెంటీస్ లోని రెండు హామీలను అమలుచేస్తోంది. మిగిలిన నాలుగు హామీల అమలుకు కూడా కసరత్తులు చేస్తోందని చెప్పుకోవచ్చు.





పనిలోపనిగా తమ రెండునెలల పాలనపై జనాల అభిప్రాయం సేకరించటం నాలుగో పాయింట్. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వంశీ పాదయాత్ర మూడురోజులు జరగబోతోంది. అంటే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మధ్యలో మూడురోజల గ్యాప్ తో  25 రోజులు వంశీ పాదయాత్ర చేయబోతున్నారు. జనవరి 31వ తేదీన మొదలయ్యే యాత్ర ఫిబ్రవరి నాలుగో వారంలో ముగియబోతోంది. అప్పటికి పార్లమెంటు ఎన్నికల నోటిపికేషన్ కూడా వచ్చేసే అవకాశాలున్నాయి. కాబట్టి అప్పటినుండి ఎన్నికల ఫీవర్ పెరిగిపోతోంది. అందుకనే పాదయాత్రను వంశీ మొదలుపెడుతోంది. మరి దీని ప్రభావం ఎలాగుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: