Ycp: వైసిపి మేనిఫెస్టోలో రాబోతున్న అంశాలు ఇవే..!!

Divya
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 నినాదంతో ప్రస్తుతం అడుగులు వేస్తూ ముందుకు వెళుతున్నారు. అలాగే పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా ముఖ్యమంత్రి చాలా కసరత్తు చేస్తూ చివరి దశకు చేరుకున్నారు. ఈరోజు లేదా రేపటితో ఇన్చార్జిలో మార్పులు చివరి జాబితాను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉన్నది.. అయితే ఈ సమయంలో ఎన్నికలలో మహిళలకు ఉద్యోగాలకు రైతులకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే విధంగా ఈ నెల 31న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం పొందిన తర్వాత నేరుగా మ్యానిఫెస్టోలోని విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని పట్టుదలతో ఈసారి ఉన్నారు. అందుకే ఇటీవల భీమిలి సిద్ధం సభకు కూడా ఎన్నికల సమరాన్ని పూరించారు. 2019 ఎన్నికల సమయంలో 99% జగన్ అమలు చేసిన పలు రకాల హామీలతో ధీమాగా ఎన్నికల బరిలో దిగబోతున్నారు.. ఇలాంటి సమయంలోనే ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేయాలని మరొకసారి ముందుకు వెళుతూ ఎన్నికలవేళ వరాలు కులిపిస్తున్నారు. వచ్చే నెల 20వ తేదీ తర్వాత ఏ క్షణమైన ఎన్నికలు షెడ్యూల్ రిలీజ్ కావచ్చని ఫిబ్రవరి 6వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించబోతున్నారు.

ఈసారి మంత్రివర్గ సమావేశంలో డీఎస్సీ నిర్వహణ పైన నిర్ణయం తీసుకోవడంతోపాటు ఉద్యోగులకు కొత్త పి.ఆర్.సి పైన ప్రభుత్వం కమిటీ ఉంది.. ఈలోగా ఉద్యోగులకు IR ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన ఉన్నట్లు సమాచారం..రైతులకు రుణమాఫీ దిశగా ప్రభుత్వం చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అలాగే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంతో పాటు.. డాక్రా మహిళలకు కూడా మరొకసారి మాఫీ చేయడంతో పాటు.. రైతు భరోసాని కూడా పెంచే విధంగా మేనిఫెస్టోలో చిత్రీకరించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు వైసిపి పార్టీ సన్నిహితుల వర్గాలలో ఈ ప్రచారం ఎక్కువగా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: