అమరావతి : వీళ్ళ విషయంలో డిసైడ్ అయిపోయారా ?

Vijaya


ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎంఎల్ఏ పదవితో పాటు వైసీపీకి కూడా  రాజీనామా చేసేశారు. కాంగ్రెస్ లో చేరటానికి రెడీగా ఉన్నారు. కాపు రామచంద్రారెడ్డి కూడా ఎంఎల్ఏగా రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరటానికి సిద్ధంగా ఉన్నారు. కొలుసు పార్ధసారధి ఎంఎల్ఏగా రాజీనామా చేయకుండానే టీడీపీలో చేరిపోయారు. బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి వ్యవహారం అయోమయంగా తయారైంది. ఇద్దరు ఎంపీలు వల్లభనేని బాలశౌరి, సంజీవ్ కుమార్ రాజీనామా చేసేశారు.




జ్యోతుల చంటిబాబు, పర్వతనేని పూర్ణచంద్రప్రసాద్, పెండెం దొరబాబు ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వీళ్ళు కాకుండా మరో 15 మంది ఎంఎల్ఏల పరిస్ధితి కూడా ఇదే పద్దతిలో ఉంది. మొత్తం మీద 20 మంది ఎంఎల్ఏలు, నలుగురు ఎంపీలది దాదాపు ఒకటే పరిస్ధితి. అదేమిటంటే రాబోయే ఎన్నికల్లో పోటీకి జగన్మోహన్ రెడ్డి టికెట్లు ఇవ్వదలచుకోలేదు. ఆ విషయాన్ని నేరుగా వాళ్ళకే చెప్పేశారు. దాంతో ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు.





అసలింతకీ ఇంతమందికి టికెట్లు నిరాకరించటంలో జగన్ ఆంతర్యం ఏమయ్యుంటుంది ? అన్న విషయం పార్టీలోనే పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. పార్టీవర్గాల సమాచారం ఏమిటంటే చాలామందిని ఏదో పద్దతిలో జగన్ వదిలించుకోవాలని అనుకున్నారట. పనితీరు సరిగాలేదనో, జనాల్లో వ్యతిరకత వచ్చేసిందనో, గెలుపు అవకాశాలు లేవని రకరకాల కారణాలతో టికెట్లు ఇచ్చేదిలేదని చెప్పేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే టికెట్లు నిరాకరించిన వారిలో చాలామంది జగన్ కు బాగా సన్నిహితులనే చెప్పాలి. ఎంత సన్నిహితులైనా ఏ చిన్న విషయంలో తేడా వచ్చినా వెంటనే వాళ్ళని జగన్ దూరం పెట్టేస్తారని అందరికీ తెలిసిందే.





ఏదో విషయంలో  వీళ్ళతో జగన్ కు గ్యాప్ వచ్చేసినట్లుంది. అందుకనే వీళ్ళని వదిలించుకోవాలని డిసైడ్ అయ్యారు. ఎన్నికల ముందు వరకు ఓపికపట్టి టికెట్లు ఇచ్చేటప్పుడు వదిలించుకోవాలని అనుకున్న వాళ్ళందరికి టికెట్లు ఇచ్చేది లేదని చెప్పేస్తున్నారు. తాను వద్దనుకున్న తర్వాత ఇక వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా జగన్ పట్టించుకోరు. కొన్ని క్యారెక్టర్లింతే ఎవరు ఏమీ మార్చలేరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: