సంబరాల రాంబాబుగా అంబటి రాంబాబు చిందులు?

frame సంబరాల రాంబాబుగా అంబటి రాంబాబు చిందులు?

Purushottham Vinay
సంక్రాంతి సంబరాలతో బోలెడంత ఉత్సాహం అందరిలోనూ పొంగి పోర్లుతుంది. సత్తెనపల్లిలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు హడావుడి అయితే మాములుగా లేదనే చెప్పాలి.పాటలతో ఆయన వేసే స్టెప్పులు యూట్యూబ్ లో ఇంకా అలాగే సోషల్ మీడియాలో కూడా ఒక రేంజ్ లో బాగా వైరల్ అవుతున్నాయి.ఈ రోజు (ఆదివారం) తెల్లవారుజామున సత్తెనపల్లి బొమ్మల సెంటర్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఉదయాన్నే హాజరయ్యారు మంత్రి అంబటి రాంబాబు. గత ఏడాది భోగి వేడుకుల వేళ ఆయన ధరించి ఆశ్చర్య పరిచిన క్యాస్టూమ్ కు తగ్గట్లే.. ఈసారి కూడా ఆయన రెడీ అయ్యారు. గత సంవత్సరం సంక్రాంతికి బ్లూ కలర్ టీ షర్టు.. అదే కలర్ ట్రాక్ తో అదరగొట్టిన ఆయన.. ఈసారి మాత్రం వైట్ అండ్ థిక్ బ్లూ షర్టు.. ఛాతీ పైభాగమంతా వైట్ కలర్ లో ఉండేలా.. కింద భాగం థిక్ బ్లూ కలర్ ఉండే ట్రెండీ టీషర్టును  వేసుకొని ఆకట్టుకున్నాడు.



ఇంకా ఈసారి పండక్కి ప్రత్యేకంగా రెండు పాటల్ని సిద్ధం చేసినట్లుగా చెప్పిన అంబటి రాంబాబు ఆ రెండు పాటలకు వేర్వేరుగా ఆయన డ్యాన్స్ వేశారు. మంత్రి అంబటి రాంబాబు నిర్వహించే భోగి వేడుకులకు నియోజకవర్గం వారీగా ఉన్న ప్రజలు భారీగా తరలిరావటంతో.. తెల్లవారుజాముకే సత్తెనపల్లి వీధులన్ని కూడా జనాలతో బాగా నిండిపోయాయి. ఎంతో ఉత్సాహంతో ఆయన వేసిన స్టెప్పులు అందరిని ఎంతో అలరించేలా ఉన్నాయి. మొత్తంగా తన డ్యాన్స్ తో అంబటి రాంబాబు ఓ రేంజ్ లో అదరగొట్టేశారని చెప్పాలి. అంబటి రాంబాబు డ్యాన్స్ చూసినప్పుడు కలిగే ఫీలింగ్ విషయానికి వస్తే.. ఇంత వయసులో కూడా అంత ఎనర్జటిక్ గా డ్యాన్స్ వేయటం.. దీని కోసం ఆయన ప్రత్యేకంగా ట్రైన్ అయ్యారన్న అభిప్రాయం ఖచ్చితంగా కలుగుతుంది. అయితే వైసీపీ అభిమానులు ఆయన డాన్స్ ని ఎంజాయ్ చేస్తుంటే వైసీపీ విమర్శకులు మాత్రం ఆయన్ని తెగ ట్రోల్ చేస్తున్నారు.రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసి బాగానే డాన్స్ చేస్తున్నారుగా అంటూ ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: