గోదావరి : జనసేనలోకి ముద్రగడ..కారణమిదేనా ?

Vijaya


ఇంతకాలం కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఎవరినైతే ధ్వేషిస్తున్నారో చివరకు వాళ్ళతోనే చేతులు కలుపుతున్నారు. ఈనెల 22 లేదా 23 తేదీల్లో ముద్రగడ జనసేనలో చేరబోతున్నారు. ఈ విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ ప్రకటించారు. శనివారం కిర్లంపూడి నివాసంలో ముద్రగడతో బొలిశెట్టి భేటీ అయ్యారు. మూడురోజుల్లో రెండోసారి సమావేశమైన బొలిశెట్టి మీడియాతో మాట్లాడారు.



జనసేనలో ముద్రగడ చేరబోతున్నట్లు చెప్పారు. ఉద్యమనేతను పార్టీలోకి ఆహ్వానించటానికి ముద్రగడ ఇంటికి స్వయంగా పార్టీ అధినేత పవన్ కల్యాణే వస్తున్నట్లు చెప్పారు. పార్టీలోకి ముద్రగడను రమ్మని ఇంటికి వెళ్ళి స్వయంగా ఆహ్వానిస్తేనే బాగుంటుందని పవన్ అన్నట్లుగా బొలిశెట్టి చెప్పారు. సో, బొలిశెట్టి  ఇన్ని విషయాలు చెప్పారు కాబట్టి ముద్రగడ జనసేనలో చేరటం ఖాయమనే అనుకోవాలి. అయితే పార్టీలో చేరిన తర్వాత ముద్రగడ ఇమడగలరా ? అన్నదే సందేహం. ఎందుకంటే ముద్రగడకు ఎవరితోను ఎక్కువ కాలం పొసగదు.



పార్టీలో చేరబోతున్న ఉద్యమనేత పిఠాపురం నుండి పోటీచేసే అవకాశం ఉందంటున్నారు. అలాగే కొడుకు చల్లారావు కాకినాడ ఎంపీగా పోటీచేయబోతున్నారట. తామిద్దరం ఎన్నికల్లో పోటీచేయబోతున్నట్లు చల్లారావు ఇంతకుముందే ప్రకటించిన విషయం తెలిసిందే. నిజానికి ముద్రగడ-పవన్ మధ్య ఏమాత్రం సఖ్యతలేదు. పైగా ఇద్దరికి పడదు కూడా. అయినా ఎందుకు ముద్రగడ జనసేనలో చేరుతున్నారు ? ముద్రగడను పవన్ పార్టీలోకి చేర్చుకుంటున్నట్లు ? ఎందుకంటే కాపుల ఓట్లను గంపగుత్తగా జనసేన+టీడీపీ కూటమికి  వేయించటమే టార్గెట్టుగా అర్ధమవుతోంది.



టీడీపీ, జనసేన కూటమిలో ముద్రగడ చేరకుండా వైసీపీలో చేరితే కాపుల ఓట్లు చీలిపోతాయని పవన్ భయపడినట్లున్నారు. జనసేనలో చేరాల్సిన అవసరం ముద్రగడకు ఏమీలేదు. ఇదే సమయంలో ముద్రగడను పార్టీలోకి చేర్చుకోవాల్సిన అవసరం పవన్ కు చాలా ఉంది. ఎందుకంటే కాపుల ఓట్లు వైసీపీ వైపుకు పోనీయకుండా ఆపటం కోసమే. అయితే పవన్ మరచిపోయిందేమంటే ముద్రగడ చెప్పినంత మాత్రాన కాపులందరు జనసేన లేదా టీడీపీకి వేస్తారని లేదు. ఎందుకంటే ప్రత్తిపాడు, పిఠాపురంలో పోటీచేస్తే ముద్రగడకే జనాలు ఓట్లేయలేదు కాబట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: