త్వరపడండి.. ఈరోజే చివరి తేదీ?

praveen
తెలంగాణ సర్కార్ ఇటీవలే వాహనదారులందరికీ కూడా ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా పెండింగ్ చలాన్లను వసూలు చేసేందుకు మరోసారి వినూత్నమైన ఆలోచన చేసింది. గతంలో ఇలాగే పెండింగ్ చలాన్లపై భారీ రాయితీని ప్రకటించింది అని చెప్పాలి. దీంతో కేవలం 40 రోజుల్లోనే 300 కోట్లకు పైగా పెండింగ్లో ఉన్న చలాన్లు వసూలు అయ్యాయి. అయితే ఇంకా చాలామంది వాహనదారులు ఇక పెండింగ్ చలాన్ లను కట్టకుండా అలాగే ఉండిపోయారు. ఈ క్రమంలోనే అలాంటి వాహనదారుల కోసం మరోసారి ఇలాంటి రాయితీని అందుబాటులోకి తీసుకువచ్చింది ప్రభుత్వం.

 ద్విచక్ర వాహన దారులకు ఆటోలకు 80% కార్లు సహా ఇతర వాహనాలకు 60 శాతం ఆర్టీసీ బస్సులకు 90% రాయితీని ఇస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే ఇక ప్రభుత్వం ప్రకటించిన రాయితీని వాహన దారులు అందరు కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పటికే దాదాపుగా అందరూ వాహనదారులు కూడా ఇక తమ పెండింగ్ చలాన్ లను  కట్టేశారు అన్న విషయం తెలిసిందే. డిసెంబర్ 26వ తేదీ నుంచి ఈ పెండింగ్ చలాన్లపై రాయితీని వర్తింప చేస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

 అయితే ఇక ప్రభుత్వం ప్రకటించిన రాయితీ విషయం లో వాహనదారులందరూ కూడా కాస్త తొందర పడాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే ప్రభుత్వం ప్రకటించిన పెండింగ్ చలాన్ల రాయితీ నేటితో ముగుస్తుంది అని చెప్పాలి. దీంతో ఈ రోజు గనక మీరు పెండింగ్ చలన్లు కట్టక పోతే ఇక రేపటి నుంచి ఇక ఎలాంటి రాయితీ లేకుండానే మళ్లీ చలాన్లను చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది అని చెప్పాలి. ఈ క్రమం లోనే వాహనదారులందరూ కూడా అలర్ట్ అయ్యి ట్రాఫిక్ చలాన్లపై రాయితీ అని ఉపయోగించుకోవాలి అని సూచిస్తున్నారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: