వార్నీ.. జగదీశ్ రెడ్డిలో ఇంత టాలెంట్‌ ఉందా?

Chakravarthi Kalyan
భారత్ క్రికెట్ మ్యాచ్ ఆడితే పాకిస్థాన్ తో ఆడాలి. అదే బంగ్లాదేశ్ తో ఆడితే ఏం మజా ఏం ఉంటుంది అని అభిమానుల భావిస్తుంటారు.  అలాగే  సరైన ప్రతి నాయకుడు ఉన్నప్పుడే సినిమా అద్భుతంగా ఆడుతుంది.  బ్లాక్ బస్టర్ అవుతుంది. అలాగే రాజకీయాల్లో బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడే రాజకీయం రంజుగా మారుతుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన  తర్వాత ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగినట్లు ఏ సభలోను జరగలేదు.


వాదోపవాదనలు, విమర్శలు, సవాళ్లు, ప్రతి పవాళ్లు, మాటకు మాట  అధికార పక్షం ప్రతి పక్షం నువ్వా నేనా అన్నట్లు సాగాయి.  గతంలో ప్రస్తుత ప్రతిపక్ష బీఆర్ఎస్ ఉన్నంత బలంగా కాంగ్రెస్ లేదు. దాదాపు గెలిచిన ఎమ్మెల్యేలను కేసీఆర్ చేర్చుకోవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య పదిలోపే ఉండేది.  అప్పుడు అధికార పార్టీ చెప్పే ప్రసంగాలను వినడం మినహా  ప్రశ్నించే గొంతుకే లేకుండా పోయింది. ప్రజలు కూడా బీఆర్ఎస్ లో కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్ లు మాట్లాడినట్లు మరెవరూ లేరని భావించేవారు.  సభ ఎప్పుడూ ఈ ముగ్గురి చుట్టూనే తిరుగుతూ ఉండేది.


కానీ అవకాశం ఇస్తేనే తాము ఏం తక్కువ కాదని నిరూపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అసెంబ్లీలో విద్యుత్తు అప్పులపై జరిగిన చర్చ సందర్భంగా మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి  ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొడుతూ సవాళ్లకు ప్రతి సవాళ్లు విసిరారు. జ్యూడిషియల్ విచారణ జరపండి అని ప్రభుత్వానికే సవాల్ విసిరారు. ప్రభుత్వంలోనే కాదు వ్యాపారంలో, కుటుంబంలో అప్పులు చేయడం అనివార్యం. చేసిన అప్పులతో భారీ వ్యవస్థను రూపొందించాం. 24గంటలు నిరంతరంగా విద్యుత్తు అందించాం.


అప్పులతో పాటు ఆస్తులను పెంచాం అని జగదీశ్రెడ్డి ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అప్పులు చేయకుండా ప్రభుత్వాన్ని నడుపుతా అంటే మంచితే అని చురకలంటించారు.  ఈ అసెంబ్లీ సమావేశాలతో జగదీశ్రెడ్డిలోని మంచి వక్త బయటకు వచ్చారు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

BRS

సంబంధిత వార్తలు: