అమరావతి : చాలా కాన్ఫిడెంటుగా ఉన్నారే

Vijaya


అధికారంలోకి వచ్చే విషయంలో చంద్రబాబునాయుడు చాలా కాన్ఫిడెంటుగా ఉన్నాట్లున్నారు. తుపాను బాధితులను పరామర్శించేందుకు గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పర్యటించినపుడు మాట్లాడిన మాటలే ఇందుకు ఉదాహరణ. తుపానువల్ల పంటలు దెబ్బతిన్న రైతులతో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా యథావిధిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై నోటికొచ్చిన ఆరోపణలు చేశారు. ఇంతకీ చంద్రబాబు ఏమన్నారంటే నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరాకు రు. 50 వేలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతుల కోసం ఎంతవరకైనా తాను ముందుండి పోరాడుతానని చెప్పారు.



ఒకవేళ ప్రభుత్వం గనుక పరిహారం ఇవ్వకపోతే మూడునెలల్లో అధికారంలోకి రాగానే తమ ప్రభుత్వం తరపున పరిహారం చెల్లిస్తానన్నారు. వరికి హెక్టారుకు రు. 30 వేలు, ఆక్వాకు రు. 50 వేలు, మరణించిన వారి కుటుంబాలకు తలా రు. 10 లక్షలు, గాయపడిన వారికి తలా రు. 2 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దెబ్బతిన్న ఇళ్ళకు, మరణించిన పశువులకు, ఇతర పంటలకు కూడా ఎంతెంత పరిహారం ఇవ్వాలో చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.



ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ప్రకృతి వైపరీత్యాల్లో జరిగిన నష్టాలకు పరిహారం ఇచ్చే విషయంలో కొన్ని లెక్కలుంటాయి. దాని ప్రకారమే ప్రభుత్వాలు పరిహారాన్ని అందిస్తాయి. ఒకపుడు చంద్రబాబు హయాంలో నష్టపోయిన రైతులకు ఇపుడు డిమాండ్ చేసినట్లు నష్టపరిహారం ఇవ్వలేదు. అధికారంలో ఉన్నపుడు రూల్సు మాట్లాడే చంద్రబాబు ప్రతిపక్షంలోకి రాగానే సానుభూతి మాటలు మాట్లాడుతారని అందరికీ తెలిసిందే. అధికారంలో ఉన్నపుడు ఏరోజూ కౌలు రైతులను పట్టించుకోని చంద్రబాబు ఇపుడు వాళ్ళకి మద్దతుగా మాట్లాడటమే విచిత్రంగా ఉంది.



ఏదేమైనా అధికారంలోకి వచ్చే విషయంలో చంద్రబాబు ఫుల్ కాన్ఫిండెంటుగా ఉన్నట్లున్నారు. అందుకనే ఇపుడు జగన్ పరిహారం ఇవ్వకపోతే మూడు నెలల్లో తమ ప్రభుత్వం రాగానే ఇస్తానని భరోసా ఇచ్చింది. తాను అధికారంలో ఉన్నపుడు బాధితులకు ఎంత పరిహారం ఎంతిచ్చారనేది  లెక్కలు తీస్తే తెలుస్తుంది చంద్రబాబు బండారం. పుణ్యక్షేత్రాల సందర్శన తర్వాత  జరిగిన మొదటి పర్యటనను అడ్వాంటేజ్  తీసుకోవాలని చంద్రబాబు బాగానే ప్రయత్నించారు. మరి చంద్రబాబు మాటలను ఎంతమంది నమ్ముతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: