హైదరాబాద్ : రేవంత్ గురుభక్తిని చాటుకున్నారా ?

Vijaya


పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగంగా అంగీకరించకపోయినా చంద్రబాబునాయుడు శిష్యుడన్న విషయం అందరికీ తెలుసు. రేవంత్ రాజకీయమంతా సదా చంద్రబాబు ప్రయోజనాల కోసమే అయ్యుంటాయి. ఇపుడిదంతా ఎందుకంటే ఎల్లోమీడియా ఛానల్ ఇంటర్వ్యూలో రేవంత్ మాట్లాడుతు అధికారంలోకి రాగానే కేసీయార్, కేసీయార్ కుటుంబం అవినీతిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు మీద వ్యక్తిగత కక్షసాధించినట్లు కాదని చెప్పారు. ఈ మాట చెప్పటంలోనే చంద్రబాబు మీద తనుకున్న గురుభక్తిని రేవంత్ చాటుకున్నారు.





తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కేసీయార్ కుటుంబం మీద కేసులు పెట్టి విచారణ చేస్తే చట్టప్రకారం చేసినట్లట. అదే ఇపుడు ఏపీలో చంద్రబాబు మీద జరుగుతున్న విచారణంతా జగన్ వ్యక్తిగత కక్షతో చేస్తున్నారట. రేవంత్ చాలా తెలివైన వాడన్న విషయం అందరికీ తెలుసు. కానీ చంద్రబాబు విషయంలో మాత్రం చాలా మూర్ఖంగా మాట్లాడారు. స్కిల్ స్కామ్ లో అన్నీ ఆధారాలతోనే సీఐడీ చంద్రబాబు మీద కేసు నమోదుచేసి అరెస్టుచేసిన విషయం రేవంత్ కు తెలీదా ?  సీఐడీ చూపించిన ఆధారాలతో ఏకీభవించిన కారణంగానే చంద్రబాబుకు కోర్టు రిమాండు విధించిందని అందరికీ తెలుసు.





చంద్రబాబు మీద సీఐడీ పెట్టిన ఇతర కేసులు ఏదో అల్లాటప్పాగా పెట్టలేదు. అన్నింటిలోను ప్రాధమిక సాక్ష్యాలను సేకరించిన తర్వాతనే కేసులు పెట్టింది. విచారణలో కేసులు నిలబడతాయా లేదా అన్నది వేరే విషయం. చంద్రబాబు+రేవంత్ ఇద్దరు ఇరుక్కున్న ఓటుకునోటు కేసులో కూడా ఇద్దరిలో ఎవరికీ ఇంతవరకు శిక్షపడలేదు. అంతమాత్రాన ఇద్దరూ నేరానికి పాల్పడలేదని ఎవరైనా అనగలరా ?





పైగా చంద్రబాబును అరెస్టు చేయటం  తనను బాధించిందని రేవంత్ చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. అవినీతికి పాల్పడి దొరికిన తర్వాత కేసు పెట్టి అరెస్టు చేయకుండా ప్రభుత్వం ఎందుకు ఊరుకుంటుంది ? ఇందులో బాధపడాల్సింది ఏముందో రేవంతే చెప్పాలి. చంద్రబాబు మీద జగన్ ప్రభుత్వం తప్పుడు కేసు పెడితే బాధపడాలి. చంద్రబాబు అవినీతికి పాల్పడలేదని లాయర్లే చెప్పటంలేదు. ఎన్నిరోజులైనా చంద్రబాబు అరెస్టు తప్పని మాత్రమే వాదిస్తున్నారు.   ఇక్కడే చంద్రబాబుతో తనకున్న బంధం ఎంతగట్టిదో రేవంత్ స్పష్టంగా బయటపెట్టుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: