అమరావతి : చంద్రబాబు అరెస్టును తమ్ముళ్ళు సమర్ధిస్తున్నారా ?

Vijaya


స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబునాయుడు అరెస్టు, రిమాండుపై ఏపీ రాజకీయాల్లో నానా గోల నడుస్తోంది. ఇదే విషయమై ప్రముఖ సర్వే సంస్ధ సీ ఓటర్ ఒక సర్వే నిర్వహించిందట. ఆ సర్వే వివరాలను ఎల్లోమీడియా చాలా ప్రముఖంగా అచ్చేసింది. ఆ సర్వేలో మూడు ఇంట్రెస్టింగ్ పాయింట్లున్నాయి. మామూలుగా పార్టీ అధినేతల అవినీతి, నాయకత్వ లక్షణాలు, పార్టీ గ్రాఫ్ తదితరాలపై  ఏ సర్వే సంస్ధయినా జనాలతో మాట్లాడుతుంది. కానీ ఇక్కడ సీ ఓటర్ మాత్రం జనాలతో కాకుండా కేవలం పార్టీలతోనే మాట్లాడింది.



ఈ సర్వేలో బయటపడిన రెండో ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే చంద్రబాబు అరెస్టు, రిమాండు సక్రమమే అని టీడీపీలోని 23 శాతం మంది అభిప్రాయపడుతున్నారట.  అన్యాయం, అక్రమమని టీడీపీలోని 77 శాతం అభిప్రాయపడితే 23 శాతం మంది అన్యాయం ఏమీలేదు సక్రమమే అని అభిప్రాయపడటం ఆశ్చర్యంగానే ఉంది. మామూలుగా అయితే నూటికి నూరుశాతం చంద్రబాబు అరెస్టు అక్రమమని,   అన్యాయమని తమ్ముళ్ళు అభిప్రాయపడాలి.



ఇక బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు చంద్రబాబు అరెస్టు అక్రమమని, వైసీపీకి నష్టమేనని, టీడీపీ, జనసేనకు లాభమని అభిప్రాయపడటంలో ఆశ్చర్యమేముంది. ఎందుకంటే ఈ పార్టీలు మొదటినుండి జగన్ కు బద్ధ వ్యతిరేకంగానే ఉన్నాయి. అవసరమున్నా లేకపోయినా జగన్ను టార్గెట్ చేస్తు బురదచల్లేస్తున్న విషయం అందరు చూస్తున్నదే. కాబట్టి విషయం ఏదైనా జగన్ కు వ్యతిరికేంగా మాట్లాడటమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. మూడోపాయింట్ ఏమిటంటే సీ ఓటర్ అసలు జనసేనను పరిగణలోకి తీసుకోకపోవటం.



సీ ఓటర్ చేసిన సర్వే మొత్తం జగన్ కు వ్యతిరేకంగాను, చంద్రబాబుకు మద్దతుగాను ఉండటంలో ఆశ్చర్యమేమీలేదు. దీనికి సీ ఓటర్ ప్రత్యేకించి సర్వే చేసి తెలుసుకోవాల్సిన అవసరమేలేదు. విషయం ఏదైనా పార్టీల అభిప్రాయాలు కాదు కావాల్సింది జనాభిప్రాయమే ముఖ్యం. పైగా ఎన్నికలు ఎప్పుడో తొమ్మిది నెలల తర్వాత జరగబోతున్న కారణంగా ఇప్పటి అభిప్రాయం అప్పటివరకు స్ధిరంగా ఉంటుందనేందుకు లేదు. ఏదేమైనా అభిప్రాయ సేకరణ అంటే జనాలతో మాట్లాడి తెలుసుకోవాలి కానీ పార్టీల నేతలతో మాట్లాడి కాదని సీఓటర్ కు తెలీదా ? 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: