అమరావతి : లోకేష్ కు షాకిచ్చారా ?

Vijaya
 

యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ కు ఇద్దరు ఎంపీలు పెద్ద షాకిచ్చినట్లున్నారు. గుంటూరు జిల్లాలో జరిగిన పాదయాత్రలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఎక్కడా కనబడలేదు. తర్వాత విజయవాడలోకి ప్రవేశించినపుడు ఎంపీ కేశినేని నాని కనబడలేదు. గుంటూరులో గల్లా, విజయవాడలో కేశినేని ఇద్దరు లోకేష్ కు స్వాగతం చెబుతారని అందరు అనుకున్నారు. కానీ ఇంట్రెస్టింగుగా ఇద్దరు అడ్రస్ కనబడలేదు.




ఇద్దరు కూడా లోకేష్ పాదయాత్రను ఎందుకు రిసీవ్ చేసుకోలేదు, ఎందుకు పార్టిసిపేట్ చేయలేదో ఎవరికీ అర్ధంకావటంలేదు. చాలాకాలంగా పార్టీలో కేశినేని పెద్ద తలనొప్పిగా తయారైన విషయం తెలిసిందే. చంద్రబాబును కూడా విజయవాడ ఎంపీ లెక్కచేయటంలేదు. అలాగే విజయవాడ లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీల్లో తిరుగుతున్నపుడు వైసీపీ ఎంఎల్ఏలు బాగా పనిచేస్తున్నారని పదేపదే ప్రశంసిస్తున్నారు. ఇది టీడీపీకి పెద్ద తలనొప్పిగా తయారైనా ఏమీ చేయలేని పరిస్దితుల్లో ఉన్నారు.



చంద్రబాబుకు ఇదేవిషయమై తమ్ముళ్ళు ఫిర్యాదులు చేసినా ఎలాంటి ఉపయోగం కనబడలేదు. కాబట్టి తన పనేదో తాను చేసుకుని వెళిపోతున్నారు. కాబట్టి వచ్చేఎన్నికల్లో ఎంపీ అసలు టీడీపీ తరపున పోటీచేస్తారా ? చంద్రబాబు ఎంపీకి టికెట్ ఇస్తారా అనేది కూడా అయోమయంగా తయారైంది. కాబట్టి ఈ నేపధ్యంలోనే కేశినేని యువగళం పాదయాత్రలో లోకేష్ ను రిసీవ్ చేసుకోలేదు,పార్టిసిపేట్ చేయలేదని అనుకుంటున్నారు. ఇక గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ వ్యవహారం కూడా వేరేగా వినబడుతోంది.



రాబోయే ఎన్నికల్లో జయదేవ్ ఎంపీగా పోటీచేసేది లేదని చంద్రబాబుకే చెప్పేశారట. తాను ఐదేళ్ళు బ్రేక్ తీసుకోవాలని అనుకున్నట్లు చెప్పారట. వ్యాపారాన్ని విస్తరిస్తున్న నేపధ్యంలో తాను రాజకీయాలకు సమయాన్ని కేటాయించలేకపోతున్నట్లు చెప్పారట. అందుకనే గుంటూరులో ఎంపీ అభ్యర్ధిగా వేరే ఎవరినైనా రెడీ చేసుకోవాలని కూడా చెప్పేశారట. అయతే చంద్రబాబు మాత్రం అందుకు అంగీకరించలేదని పార్టీవర్గాలు చెబుతున్నాయి. మరి చివరకు ఏమి జరుగుతుందో చెప్పలేం. కారణం ఏదైనా ఇందుకనే జయదేవ్ కూడా పాదయాత్రలో ఎక్కా కనబడలేదని పార్టీవర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: