వైసీపీ.. ఈ అరాచకాలు మానుకోవాలి?
అనంతరం ఆ పత్రిక ఓనర్ సజ్జన్ రావును వనిత ఇలా రాయడానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తే అసలు ఆ వార్తకు నాకు ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు. ఎవరో కావాలనే దాన్ని సృష్టించారని అన్నారు. సైబర్ క్రైం కు నేను రిపోర్టు చేస్తున్నారు. మీరే నాకు అండగా నిలబడాలని అనితను కోరారు. దీంతో వారు ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి.
దేశ చరిత్రలో ఇంత అసహ్యకరమైన పోస్టు పెట్టినది ఇంకోటి లేదని తెలుస్తోంది. బూతు పదాన్నే హెడ్డింగ్ గా పెట్టడం అనేది పరాకాష్టను ప్రతీక. ప్రస్తుతం వంగలపూడి అనితపై సోషల్ మీడియాలో జరిగిన దాడి చాలా నీచమైనది. నిజంగా చెప్పాలంటే లైంగిక దాడితో సమానమని మహిళలు ఆరోపిస్తున్నారు. రాజకీయాల్లో ఉన్న ఒక మహిళను ఇంతలా దిగజార్చి ఏం సాధిస్తారని అంటున్నారు. ఒక రకంగా దుర్మార్గమైన, అసభ్య పదజాలం వాడారు.
ఎవ్వరైనా సరే ఒక ప్రజా క్షేత్రంలో ఉన్న మహిళకు ఇంతలా అన్యాయం జరుగుతుంటే కచ్చితంగా ఎవరైనా ఖండించాల్సిందే. ఎవరైతే అది సృష్టించాలో.. దాన్ని ఎవరైతే దాన్ని షేర్ చేశారో.. ఆ పోస్టును ఎవరైతే వైరల్ చేశారో వారిని అరెస్టు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఇలాంటి పోస్టులను పెట్టే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని వారి కుటుంబ సభ్యుల ఎదుటే కౌన్సెలింగ్ ఇచ్చి మరో సారి మహిళలపై ఎవరూ కూడా పిచ్చి కూతలు రాయకుండా ఉండేలా చూడాలని కోరుతున్నారు.