పవన్ వారాహి రికార్డులు.. ఓట్లు రాలుస్తాయా?
గత 20 ఏళ్ల నుంచి రాజకీయ పార్టీలు అధికారం చేపట్టడానికి చేసిన ప్రయత్నాల్లో మొదటి పాదయాత్ర. 2004 సంవత్సరంలో పాదయాత్ర వల్ల ప్రజల్లోకి పార్టీని పథకాలను, అధికార పక్షం చేస్తున్న అవినీతిని తీసుకెెళ్లడంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సక్సెస్ అయ్యారు. తర్వాత 2009 లో తాము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గెలిపిస్తాయనే ధీమాతో ఆయన ఉండి మళ్లీ కాంగ్రెస్ ను ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో గెలిపించుకున్నారు.
వారాహి చైతన్య రథంతో ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఏపీలో ప్రజల వద్దకు వెళుతున్నారు. గతంలో ఎన్టీ రామారావు ప్రజల వద్దకు చైతన్య రథయాత్ర అంటూ వెళ్లి అధికారం చేజిక్కించుకున్నారు. ఆఖరికి చంద్రబాబు కూడా 2014 లో పాదయాత్ర చేసి ప్రజల వద్దకు వెళ్లి వారి బాగోగులు తెలుసుకుని అధికారం దక్కించుకున్నారు. 2019 ఎన్నికలకు ముందుకు వైఎస్ జగన్ చేసిన మహా పాదయాత్ర ఆయనకు సీఎం పదవి వచ్చేలా చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రలకు అంత పాపులారిటీ ఉంది. రథయాత్రలకు క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం టీడీపీ యువనేత యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. మరో వైపు పవన్ వారాహి తో బస్సు యాత్ర చేస్తున్నారు. ఇందులో ఏ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడతారో ఎవరినీ అందలం ఎక్కిస్తారో చూడాలి.