అమరావతి : కాంగ్రెస్ కు షర్మిలే దిక్కా ?

Vijaya


కోమాలో ఉన్న ఏపీ కాంగ్రెస్ పార్టీకి వైఎస్సార్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలే దిక్కయ్యేట్లున్నారు. పార్టీ సినియర్ నేత కేవీపీ రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతు తొందరలోనే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తనకు సమాచారం ఉందన్నారు. పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం ఉందని కేవీపీ అన్నారంటే చేరటం ఖాయమైపోయినట్లే అనుకోవాలి. కాకపోతే తెలంగాణాలోనే ఉంటారా లేకపోతే ఏపీకి వస్తారా అన్నదే పాయింట్. అందుబాటులో ఉన్న సమాచారం అయితే ఏపీకే రాబోతున్నట్లు తెలుస్తోంది.



ఎందుకంటే షర్మిలను తెలంగాణా కాంగ్రెస్ లో చేర్చుకోవద్దని అక్కడి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అండ్ కో గట్టిగా చెబుతున్నారు. షర్మిల పార్టీని ప్రజలంతా ఆంధ్రపార్టీగానే చూస్తున్నారని, కాబట్టి ఆమెను పార్టీలోకి చేర్చుకుంటే నష్టం తప్పదని అధిష్టానానికి పదేపదే చెబుతున్నారు.  2018 ఎన్నికల్లో చంద్రబాబునాయుడుతో పొత్తుపెట్టుకున్నపుడు ఫలితాన్ని  గుర్తుచేస్తున్నారు. సరే వీళ్ళెంత చెప్పినా ఫైనల్ డెసిషన్ అధిష్టానానిదే అన్న విషయం తెలిసిందే.




ఇక ఏపీ విషయాన్ని చూస్తే పార్టీ గడచిన పదేళ్ళుగా కోమాలోనే ఉంది. రాష్ట్రవిభజన తర్వాత పార్టీ పూర్తిగా నేలమట్టమైపోయింది. ఎంతమంది అధ్యక్షులు వచ్చినా పార్టీకి జవసత్వాలు రావటంలేదు. ప్రజల ఆధరణను పోగొట్టుకున్న పార్టీకి అధ్యక్షుడిగా ఎవరున్నా చేయగలిగేదేమీ ఉండదు. పైగా విభజన నాటికి పార్టీలో ఉన్న సీనియర్లలో చాలామంది వైసీపీలోకి, టీడీపీలో చేరిపోయారు. ఇపుడున్న సీనియర్లు పై రెండుపార్టీలు చేర్చుకోలేదుకోబట్టి వేరేదారిలేక కాంగ్రెస్ లోనే కంటిన్యు అవుతున్నారు. అంటే వీళ్ళంతా మిగిలిపోయిన సరుకనే అనుకోవాలి.



ఇలాంటి నేతలున్న పార్టీలో చేరి షర్మిల ఏమిచేయగలరు ? దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కూతురిగా  ఇపుడున్న నేతలకన్నా షర్మిల చాలా బెటరనే చెప్పాలి. అయితే వైసీపీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నపుడు జనాలు షర్మిలను ఎందుకు పట్టించుకుంటారు. కాకపోతే ఎల్లోమీడియా మద్దతుతో కొద్దిరోజులు షర్మిల హడావుడి అయితే చేయగలరు. 2024 ఎన్నికలయిపోతే షర్మిలెవరో కాంగ్రెస్ పార్టీ ఎక్కడో అన్నట్లుగా తయారవుతుంది వ్యవహారం. మళ్ళీ 2029 ఎన్నికలకు రాజెవరో రెడ్డెవరో అన్న సామెతలాగ అయిపోతుంది మొత్తం పరిస్దితి. చూద్దాం షర్మిల ప్రవేశం ఎక్కడుంటుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: