రసవత్తరంగా నెల్లూరు రాజకీయం?

Chakravarthi Kalyan
ఆనం రాంనారాయణ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి  బయటికి వచ్చిన విషయం తెలిసిందే. ఆయన వైసీపీ నుండి బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ వైపుగా వెళ్తున్నారు ఇప్పుడు. అయితే ఆయన తెలుగుదేశం తరపున నెల్లూరు నుండి పోటీ చేయాలని సంకల్పించుకున్నారట. అక్కడ వరకు బానే ఉంది. కానీ మాజీ రాష్ట్ర మంత్రి, ఇంకా ప్రస్తుత వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఆనం నారాయణరెడ్డిని అక్కడ నుండి సవాల్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది.


దమ్ముంటే తనకు ఎదురుగా నెల్లూరులో పోటీ చేయమని సవాల్ చేస్తున్నాడట అనిల్ కుమార్ యాదవ్. అయితే దీనికి రాంనారాయణ ఇప్పుడు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన గతంలో అనిల్ కుమార్ యాదవ్ కి వ్యతిరేకంగా పోటీ చేశారు. అయితే అప్పుడు ఆనం రాంనారాయణ 70-80కోట్లు పెట్టినా కూడా అనిల్ కుమార్ యాదవ్.. ఆనం రాంనారాయణ పెట్టిన దాంట్లో సగం డబ్బు పెట్టి గెలిచారు.


కారణం ఏంటంటే ఆనం రాంనారాయణ పై ఉన్న వ్యతిరేకత ఒకటి. మరో కారణం వచ్చి జగన్ హవా అని తెలిసింది. అయితే ప్రస్తుతం ఆనం రాంనారాయణ మీద సింపతి ఉంటుందని అనిల్ కుమార్ యాదవ్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. దానికి తోడు చంద్రబాబు  కూడా తెలుగుదేశం లోకి ఆనం రాంనారాయణకి వెల్కమ్ చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఆనం వర్సెస్ అనిల్ కుమార్ యాదవ్ అన్నట్లే ఉంటుంది నెల్లూరులో పరిస్థితి.


ఇక జిల్లాకే చెందిన మరో నేత నారాయణ విషయానికి వస్తే.. ఆయన నారాయణ విద్యాసంస్థల అధినేత అనే విషయం తెలిసిందే. గల్లా జయదేవ్, నారాయణ ఇద్దరు కూడా ఈసారి ఎలక్షన్లలో పోటీ చేయరు అనే మాటలు వినపడ్డాయి మొన్నటి వరకు. నారాయణ వ్యాపారాలను జగన్ దెబ్బతీస్తున్నారు అని భావిస్తున్నారు. ఏదేమైనా నెల్లూరు రాజకీయం మాత్రం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. చూడాలి ఏం జరుగుతుందో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: