అమరావతి : చంద్రబాబుకే నాగబాబు ఫిట్టింగ్ పెడుతున్నారా ?

Vijaya



చూస్తుంటే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడుకే జనసేన నాగబాబు ఫిట్టింగ్ పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లున్నారు. ఎవరితో ఏమి మాట్లాడినా, సందర్భం ఏదైనా సరే రాబోయేది జనసేన ప్రభుత్వం, పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అని పదేపదే చెబుతున్నారు. ఇక్కడే చాలామందిలో అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు టీడీపీ-జనసేన పొత్తు విషయాన్ని ఇటు చంద్రబాబు అటు పవన్ అధికారికంగా ప్రకటించలేదు.



పొత్తు దాదాపు ఖాయమే అయినా పవన్ కు ముఖ్యమంత్రయ్యే అవకాశం దాదాపు లేదనే చెప్పాలి. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు చివరి ఎన్నికలని చెప్పాలి. ఎన్నికల నాటికి చంద్రబాబు వయసు 75కు చేరుకుంటుంది. ఆ తర్వాత అంటే 2029కి చంద్రబాబు వయసు 80 అవుతుంది. కాబట్టి వచ్చేఎన్నికల్లో టీడీపీ-జనసేన అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉంటారు కానీ పవన్ ఎట్టిపరిస్ధితుల్లో కారు.



కాకపోతే అధికారంలో భాగస్వామ్యం పేరుతో కొన్ని మంత్రిపదవులు తీసుకోవచ్చంతే. అప్పుడది పేరుకు సంకీర్ణ ప్రభుత్వమే అయినా వ్యవహారమంతా చంద్రబాబు ప్రభుత్వంగానే సాగుతుంది. కాబట్టి ఏ విధంగా చూసినా నాగబాబు చెబుతున్నట్లుగా జనసేన ప్రభుత్వం కాదు పవన్ సీఎం అయ్యేదిలేదు. ఒంటరిగా పోటీచేస్తే జనసేనకు రెండోసారి కూడా వీరమరణం తప్పదని స్వయంగా పవనే చెప్పారు. జనసేన గెలవటం కాదు అసలు పవన్ గెలుస్తారో లేదో కూడా తెలీదు.



వాస్తవం ఇలాగంటే ప్రతిసారి నాగబాబు మాత్రం జనసేన ప్రభుత్వమని పవన్ ముఖ్యమంత్రని ఎందుకు చెబుతున్నారో అర్ధంకావటంలేదు. పవన్ సీఎం కాగానే ఆ వ్యవస్ధను ప్రక్షాళన చేస్తామని, టీడీపీ పరిరక్షణలో జవాబుదారీతనం తెస్తామని నోటికొచ్చింది మాట్లాడేస్తున్నారు. టీటీడీ స్వయంపాలక క్షేత్రంగా ఉండాలట. అదెలాగ సాధ్యమో మాత్రం నాగబాబుకు తెలీదు. ఏదేదో నోటికొచ్చింది మాట్లాడేస్తు మీడియాలో వార్తలు రాయించేసుకుంటున్నారంతే. దేవాదాయ, ధర్మాదాయ చట్టం ప్రభుత్వానికి లోబడి పనిచేయాల్సిందే. ఆ చట్టంలో భాగమే టీటీడీ చట్టం. అంతేకానీ టీటీడీకంటు ప్రత్యేకమైన చట్టమేదీలేదు. ఈ విషయం కూడా తెలుసుకోకుండా నాగబాబు నోటికొచ్చింది మాట్లాడేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: