అమరావతి : చంద్రబాబు ఒంటరైపోయారా ?

Vijaya




ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబునాయుడు చివరకు జాతీయ రాజకీయాల్లో ఒంటరైపోయారా ? తన అవకాశవాద రాజకీయాల కారణంగానే ఇపుడు చంద్రబాబును ఏ పార్టీకూడా నమ్మటంలేదు. బీజేపీతో పొత్తుకోసం చంద్రబాబు ఎంతగా వెంపర్లాడుతున్నా కమలంపార్టీ అగ్రనేతలు పట్టించుకోకపోవటానికి ఇదే కారణం. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అవకాశవాద రాజకీయాల గురించి నరేంద్రమోడీ కన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు లేరు. చంద్రబాబు కారణంగా బీజేపీకి మించిన బాధితపార్టీ మరోటి లేదంటే అతిశయోక్తి కాదేమో.



ఇపుడిదంతా ఎందుకంటే ఎన్డీయేలో చేరటం కోసం చంద్రబాబు తహతహలాడిపోతున్నారు. మోడీతో కలిసి పనిచేయటానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. రిపబ్లిక్ టీవీ టాక్ షో లో మాట్లాడుతు మోడీ పాలసీలను తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదన్నారు. అయితే గతంలో మోడీని చంద్రబాబు ఏ స్ధాయిలో వ్యతిరేకించారనే విషయాలను నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. మోడీకి వ్యతిరేకంగా చంద్రబాబు మాట్లాడిన పేపర్ క్లిప్పింగులను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.



రాజకీయాలకన్నా తనకు దేశమే ముఖ్యమని చంద్రబాబు చెప్పిందాంట్లో ఎంత నిజమో అందరికీ తెలిసిందే. చంద్రబాబు వైఖరి బాగా తెలియటం వల్లే ఏ ప్రాంతీయపార్టీ అధినేత కూడా పట్టించుకోవంలేదు. మమతాబెనర్జీ, నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్ లాంటి వాళ్ళు చంద్రబాబును దగ్గరకు కూడా రానీయటంలేదు. చంద్రబాబుతో పొత్తుపెట్టుకోవటం వల్లే తెలంగాణాలో దెబ్బతిన్నట్లు చాలామంది తెలంగాణా కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ గుర్తుచేసుకుంటునే ఉంటారు.



ఇదే సమయంలో తనను వ్యక్తిగతంగా చంద్రబాబు ఎంతమాటలన్నారో మోడీ మరచిపోయుంటారా ? అందుకనే చంద్రబాబు ఎంత ప్రయత్నించినా మాట్లాడటానికి కూడా మోడీ ఇష్టపడటంలేదు. అభివృద్ధికన్నా తనకు ముఖ్యమంత్రి పదవే ముఖ్యమని చంద్రబాబు ఇప్పటికే చాలాసార్లు నిరూపించుకున్నారు. అందుకనే ఎన్నిమాటలు చెబుతున్నా చంద్రబాబుతో పొత్తుపెట్టుకోవటానికి బీజేపీ ఇష్టపడటంలేదు. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ చివరకు ప్రాంతీయ పార్టీల్లో ఏ ఒక్కటి కూడా చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడటంలేదు. దీంతోనే అర్ధమైపోతోంది జాతీయరాజకీయాల్లో చంద్రబాబు ఒంటరైపోయారని. 2024 ఎన్నికల్లో టీడీపీ గెలవకపోతే చివరకు రాష్ట్రంలోని పార్టీలు కూడా చంద్రబాబును వదిలేస్తాయేమో ?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: