గత కొంతకాలం నుంచి వివిధ రకాల కారణాల వల్ల అనేక చిట్టి గుండెలు ఆగిపోతున్నాయి. చిన్న పిల్లలు, యుక్త వయస్కులు తమ కన్నతల్లిదండ్రులకు గుండెకోతను మిగులుస్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. తాజాగా మహారాష్ట్రలోని పూణేలో ఒక 14 ఏళ్ల బాలుడు గుండెపోటుతో మృతి చెందాడు.తనకు గుండెపోటు వచ్చినప్పుడు ఆ బాలుడు తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్నాడు. అకస్మాత్తుగా బాలుడు ఛాతీ నొప్పితో బాగా బాధపడ్డాడు. స్నేహితులు వెంటనే ఈ విషయాన్ని మృతుడి తండ్రికి తెలియజేయగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆ బాలుడు పరిస్థితిని చూసిన వైద్యులు అతన్ని పెద్ద ఆసుపత్రికి తీసుకుని వెళ్ళమని చెప్పారు. వెంటనే వైద్యులు ఆ బాలుడికి చికిత్స ప్రారంభించారు. అయినా కూడా ఆ చిన్నారి బాలుడు మృతి చెందాడు. ఇంత చిన్న పిల్లాడికి గుండెపోటు రావడంతో అందరూ కూడా ఎంతగానో ఆశ్చర్యపోతున్నారు.
ఇక సమాచారం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.తెలుస్తున్న సమాచారం ప్రకారం.. మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని వనూరి ప్రాంతంలో గురువారం నాడు సాయంత్రం 14 ఏళ్ల విద్యార్థి వేదాంత్ తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్నాడు. ఆట ఆడుతున్న కొద్ది సేపటికే బాలుడికి తీవ్రమైన ఛాతీ నొప్పి వచ్చింది. దీంతో చిన్నారి బాలుడు నేలపై పడి బాధపడుతూ అలాగే గిలగిలాడాడు. ఇక ఇది చూసిన ఇతర పిల్లలు వెంటనే విషయాన్ని వేదాంత్ తండ్రికి తెలియజేశారు.ఇక వేదాంత్ ను వనూరిలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వేదాంత్ కు ప్రథమ చికిత్స అందించిన తరువాత పెద్ద ఆసుపత్రికి తరలించమని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు వేదాంత్ ను ఫాతిమానగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించడం జరిగింది. ఆ చిన్నారి పరిస్థితి చూసి వైద్యులు అడ్మిట్ చేసుకుని చికిత్స ప్రారంభించినా కూడా మృతి చెందాడు. గుండె ఆగిపోయి వేదాంత్ పరిస్థితి విషమించి మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.