ఢిల్లీ : అమరావతి స్ధలాలపై దుమ్ముదులిపేసిన సుప్రిం

Vijaya


రాజధాని అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ళ స్ధలాలు ఇచ్చే విషయంలో పిటీషనర్ ను పట్టుకుని సుప్రింకోర్టు దుమ్ము దులిపేసింది. పేదలకు ప్రభుత్వం ఇళ్ళపట్టాలు ఇవ్వాలని అనుకుంటే మధ్యలో మీకు వచ్చిన కష్టము, నష్టము ఏమిటంటు నిలదీసింది. మీ దగ్గరున్న స్ధలాన్ని తీసుకుని ప్రభుత్వం పేదలకు పంచుతున్నదా అని ప్రశ్నించింది. సుప్రింకోర్టు వేసిన ఏ ప్రశ్నకు  పిటీషనర్ సమాధానం చెప్పలేకపోయాడు. దాంతో కేసు విచారణార్హం కాదని న్యాయస్ధానం భావించింది.



దాంతో కేసు కొట్టేయాలా ? లేకపోతే మీరే ఉపసంహరించుకుంటారా ? అని పిటీషనర్ను అడిగింది. సుప్రిందెబ్బకు వేరే గత్యంతరం లేక పిటీషనరే కేసును ఉపసంహరించుకున్నాడు. ఇంతకీ విషయం ఏమిటంటే అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ళపట్టాలు పంపిణీ చేయాలన్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయం. అయితే రాజధాని నిర్మాణానికి అంటే తాము భూములిచ్చాము కాబట్టి తమ భూముల్లో పేదలకు ఇళ్ళపట్టాలు ఇవ్వకూడదని అమరావతి రైతుల ముసుగులో కొందరు రియాల్టర్లు హైకోర్టులో  కేసు వేశారు.



కేసు విచారణ సందర్భంగా హైకోర్టు అడిగిన ప్రశ్నలకు పిటీషనర్ ఏమీ సమధానం చెప్పలేకపోయాడు. దాంతో కేసు కొట్టేస్తు అవసరమని అనుకుంటే సుప్రింకోర్టు పొమ్మన్నది. పిటీషనర్ ముందు వెనకా ఆలోచించకుండా సుప్రింకోర్టులో కేసు వేస్తే ఇక్కడా వాయించేసింది. పేదలకు ఇళ్ళపట్టాలు ఇస్తే మీకొచ్చే నష్టమేమిటో చెప్పమంటే పిటీషనర్ చెప్పలేకపోయాడు. తమ దగ్గర పేదలకు పట్టాలిస్తే భౌగోళిక సమతుల్యం (డెమొక్రటిక్ ఇంబ్యాలెన్స్) దెబ్బతింటుని మాత్రమే పిటీషనర్ వాదిస్తున్నారు. ఈ వాదనను సుప్రింకోర్టు కొట్టేసింది.



సుప్రింకోర్టులో డెవలప్మెంట్ల ప్రకారం అమరావతి ప్రాంతంలో 75 వేలమంది పేదలకు ఇళ్ళపట్టాలు ఇవ్వటానికి మార్గం సుగమమైనట్లే. కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని పేదల్లో కొందరికి అమరావతి ప్రాంతంలో పట్టాలు ఇవ్వబోతోంది ప్రభుత్వం. ఇందుకోసం 1175 ఎకరాలను రెడీచేయమని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. దీనికి సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయి. తొందరలోనే వేలాదిమందికి జగన్ ప్రభుత్వం ఇళ్ళపట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టబోతోంది.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: