గోదావరి : నిజంగానే కాపుల ఓట్లను తాకట్టు పెట్టేశాడా ?

Vijaya



వచ్చేఎన్నికల్లో చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిని చేయటంకోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిజంగానే కాపుల ఓట్లను తాకట్టుపెట్టేశారా ? కాపుల్లోని కొంతమంది ప్రముఖుల్లో ఈ విషయమై చర్చ పెరిగిపోతోంది. దీనికి తాజాగా రామ్ గోపాల వర్మ ట్వీట్ బాలాన్నిస్తోంది. వర్మ కూడా గోదావరి జిల్లాలకు చెందిన వ్యక్తే. ఈయనకు ఎంతోమందితో సన్నిహితముంటుంది. కాబట్టే వర్మ చేసిన తాజా ట్విట్ కాపుల్లో సంచలనంగ మారింది. ఇంతకీ తన ట్వీట్లో వర్మ ఏమన్నారంటే ‘కేవలం డబ్బుకోసమే తన సొంత కాపుల్ని, కమ్మోళ్ళకి అమ్మేస్తాడని ఊహించలేదు...RIP కాపులు, కంగ్రాట్చులేషన్స్ కమ్మోళ్ళు’. అని అన్నారు.




వర్మ ట్వీట్ కు అర్ధమేమిటంటే డబ్బుల కోసమే పవన్ కాపుల ఓట్లను చంద్రబాబునాయుడుకు అమ్మేశాడని. అందుకనే రిప్ కాపులు, కంగ్రాట్చులేషన్స్ కమ్మోళ్ళు అని చెప్పారు. కాపుల ఓట్లను చంద్రబాబుకు తాకట్టుపెట్టేశాడని, కాపుల ఓట్లను చూపించి చంద్రబాబు దగ్గర పవన్ ప్యాకేజీ తీసుకుంటున్నాడని మంత్రులు, వైసీపీ నేతలు ఎప్పటినుండో ఆరోపణలు చేస్తున్నది తెలిసిందే. ప్యాకేజీస్టార్, దత్తపుత్రుడని మంత్రులు చేస్తున్న ఆరోపణల్లో నిజమెంతో తెలీదుకానీ పవన్ వైఖరి మాత్రం అనుమానాస్పదంగానే ఉంది.



లేకపోతే టీడీపీ సభల్లో కందుకూరలో 8 మంది, గుంటూరులో ముగ్గురు చనిపోతే  చంద్రబాబుపై ఒక్కమాట కూడా మాట్లాడలేదు. రెండుఘటనలపై ప్రభుత్వం విచారణ జరిపించి బాధ్యులపై యాక్షన్ తీసుకోవాలన్న డిమాండ్ కూడా చేయలేదు. పైగా రెండు ఘటనల్లోను ప్రభుత్వానిదే తప్పని చంద్రబాబుకు మద్దతుగా నిలిచాడు. ఇలాంటి ఘటనల కారణంగానే పవన్ వైఖరిపై జనాల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలను కాపాడేందుకే పవన్ ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలకు బలం చేకూరుతోంది.



ఈ నేపధ్యంలోనే కాపుల ఓట్లను చంద్రబాబుకు పవన్ తాకట్టు పెట్టేశాడని, అమ్మేసుకుంటున్నాడనే ప్రచారం పెరిగిపోతోంది. ఈ ప్రచారాలకు వర్మ ట్వీట్ బలమిచ్చినట్లయ్యింది. నిజానికి కాపుల ఓట్లను పవన్ అమ్మలేడు, చంద్రబాబు కొనలేడు. ఎందుకంటే కాపులందరికీ పవన్ ఏమీ హోల్ సేల్ డీలర్ కానీ లేకపోతే ప్రతినిధీ కాదు. పవన్  చెబితే కాపులు టీడీపీకి ఓట్లేసేంత సీన్ లేదు. నిజంగానే అంతే సీనే పవన్ కుంటే పోటీచేసిన రెండుచోట్లా ఎందుకు ఓడిపోతారు ?



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: