సీఎం జగన్: పెన్షన్ లపై తప్పుడు ప్రచారం !
కానీ కొందరు ప్రజలు తమకున్న తక్కువ అవగాహనతో కావాలనే మా పెన్షన్ లను తొలగించారు అన్న వాదనతో ప్రభుత్వాన్ని తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు. దీనికి తోడు టీడీపీ నాయకుల స్వరం కూడా తోడవడంతో ప్రజలు జగన్ ను ఉద్దేశిస్తూ తిడుతున్నారు. అయితే ఈ పరిస్థితిని తీక్షణంగా పరిశీలిస్తున్న ప్రభుత్వ అధికారులు.. విషయాన్ని సి జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీనితో సీఎం జగన్ వెనువెంటనే కాసేపటి క్రితమే కీలక ప్రకటన చేశారు. జగన్ మాట్లాడుతూ మా ప్రభుత్వంలో ఏ పధకం అయినా అర్హులుగా ఉన్నవారికే మేము అందిస్తాం.. అదే విధంగా పెన్షన్ లను కూడా 100 శాతం అర్హులైన వారికి మాత్రం ఇస్తూ వస్తున్నాము.
ఇక అనర్హులైన వారిని లిస్ట్ నుండి తీసేస్తే తప్పు ఏమిటి అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులు పెన్షన్ కు అర్హులైన వారికి వెతికి మరీ అందచేస్తున్నప్పుడు , అర్హులు కానివారికి తీసివేయడం ఎలా తప్పు అవుతుంది అంటూ వాపోయారు. ప్రభుత్వ నియమాల ప్రకారం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆడిట్ చేయాలి.. అప్పడు ఎవరైనా అనర్హులని తెలిస్తే తీసివేసే అధికారం ఉంటుంది. వెరిఫికేషన్ చేస్తున్న మా అధికారులను... పెన్షన్ లు తీసేస్తున్నారని తప్ప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు.