రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ ను చెప్పింది.రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా కీలక విషయాలను వెల్లడించారు. రైల్వే టికెట్ బుకింగ్ రాయితీ అంశం పై కూడా స్పందించారు.. సీనియర్ సిటిజన్స్ కు మళ్లీ రాయితీ అందుబాటులోకి రావొచ్చు. అయితే ఇదివరకు ఎలా ఉందో రానున్న కాలంలో అదే రాయితీలు మాత్రం అందుబాటు లో ఉండకపోవచ్చు. కొత్త రూల్స్ అమలులో కి వస్తాయని వివరించారు.
ట్రైన్ ప్యాసింజర్ల కు కల్పించే రాయితీ వ్యవస్థలో పూర్తిగా మార్పులు చోటుచేసుకోనున్నాయి. రైల్వే బోర్డు కొత్త రూల్స్ ను తీసుకువచ్చే అవకాశం ఉంది. కేవలం కొన్ని కేటగిరిలకు మాత్రమే ట్రైన్ టికెట్ రాయితీలను పరిమితం చేసే అవకాశం ఉంది. ఈ కొత్త రూల్స్ త్వరలోనే అమలులో కి రావొచ్చు. ఈ కొత్త నిబంధనల అమలులోకి వచ్చినా కూడా సీనియర్ సిటిజన్స్ కు రాయితీ అందుబాటు లో ఉండనుంది.. ఇండియన్ రైల్వేస్ సీనియర్ సిటిజన్స్ కు ట్రైన్ టికెట్లపై రాయితీని ఎత్తివేసింది.
కోవిడ్ వచ్చిన దగ్గరి నుంచి ఈ ఫెసిలిటీని తొలగించింది. మళ్లీ ఈ సౌకర్యాన్ని అందుబాటులో కి తీసుకురాలేదు. అయితే రానున్న కాలంలో సీనియర్ సిటిజన్స్ కు మళ్లీ రాయితీ అందుబాటులో కి రావొచ్చు. అయితే గతంలో మాదిరి తగ్గింపు లభించకపోవచ్చు. కేటగిరి ప్రకారం రాయితీ మారుతూ ఉండొచ్చు. అలాగే అన్ని క్లాస్‌లకు కాకుండా ఎంపిక చేసిన కేటగిరిలకు మాత్రమే తగ్గింపు వర్తించే ఛాన్స్ ఉంది. సీనియర్ సిటిజన్స్ విషయానికి వస్తే.. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ వీరికి స్లీపర్, థర్డ్ ఏసీ టికెట్ల పై రాయితీ కల్పించొచ్చని సిఫార్సు చేసింది. అలాగే సీనియర్ సిటిజన్స్‌కు రాయితీ గతం లో కన్నా కొంత మేర తగ్గొచ్చనే అంచనాలు ఉన్నాయి.. ఇటీవల మోడీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించిన సంగతి తెలిసిందే..