ఢిల్లీ : మోడీకి షాకా ? లేకపోతో రిలీఫా ?

Vijaya

ఇపుడీ విషంపైనే అన్నీచోట్లా చర్చలు జరుగుతున్నాయి. చర్చలకు కారణం ఏమిటంటే రెండు రోజుల్లో రెండురకాల ఫలితాలు రావటమే. 7వ తేదీన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (డీఎంసీ) ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. దాదాపు 15 ఏళ్ళుగా అధికారంలో ఉన్న బీజేపీ ఓడిపోవటం కమలనాదులకు మింగుడుపడలేదు. 250 సీట్లలో ఆప్ కు 136 సీట్లొచ్చాయి. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వమే ఉండటం, ఇపుడు డీఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీ ఓడిపోవటం నరేంద్రమోడీకి వ్యక్తిగతంగా దెబ్బనే చెప్పాలి.ఇక 8వ తేదీ గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఎగ్జిట్ పోల్ సర్వేల్లో చెప్పినట్లుగానే గుజరాత్ లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకున్నది. ఇదే సమయంలో హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిందంటే 68 సీట్లలో 40 నియోజకవర్గాల్లో గెలిచింది. 40 సీట్లలో గెలిచింది కాబట్టే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అనుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ ఎంఎల్ఏలపై బీజేపీ ప్రలోభాల వల విసిరిందనే ప్రచారం మొదలైపోయిన విషయం గమనించాలి.గుజరాత్ లో మాత్రం గతంలో కన్నా బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకోవటం మోడీకి రిలీఫ్ అనే చెప్పాలి. ప్రస్తుత అసెంబ్లీలో బీజేపీకి 182 సీట్లలో 111 మాత్రమే ఉన్నాయి. కాంగ్రెస్ 67 సీట్లతో బలమైన ప్రతిపక్షంగా ఉంది. కానీ తాజా ఎన్నికల్లో బీజేపీ 158 సీట్లలో గెలిస్తే కాంగ్రెస్ 16 సీట్లకు పడిపోయింది. కాంగ్రెస్ 67 నుండి 16 సీట్లకు పడిపోవటమే హస్తంపార్టీ నేతలను బాగా నిరాసపరిచేదే.సొంతరాష్ట్రం గుజరాత్ లో అఖండ విజయం సాధంచటం మాత్రం మోడీకి పెద్ద రిలీఫనే చెప్పాలి. కాకపోతే ఈ ఫలితాలు రాబోయే లోక్ సభ ఎన్నికలపై ప్రభావాన్ని చూపిస్తాయని ఎవరు అనుకోవటంలేదు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలకు లోక్ సభ ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలు స్ధానిక అంశాల ఆధారంగా జరిగితే పార్లమెంటు ఎన్నికలు జాతీయ అంశాల ఆధారంగా జరుగుతాయి. కాకపోతే డీఎంసీ ఎన్నికల్లో ఓడిపోవటమే మోడీకి పెద్ద దెబ్బ.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: