ప్రభుత్వ ఉద్యోగులు "లంచం అడగడం" తప్పు కాదట !
వెంటనే ఫైర్యాధు స్వీకరించిన ఏసీబీ ఆ కార్యాలయంపై దాడులు జరుపగా, అధికారి టేబుల్ మీద రూ. 5000 కట్ట ఉండడాన్ని గమనించారు. కానీ ఆ కట్టాను ఆ ఉద్యోగి స్వీకరించలేదట, అయితే బాధితుడు మాత్రం వారిపై శిక్ష తీసుకోవాలని డిమాండ్ చేయడంతో ఆ విషయం కాస్త కోర్ట్ వరకు చేరింది. హై కోర్ట్ ఈ కేసును బాగా పరిశీలించి ఇచ్చిన తీర్పు ప్రభుత్వ ఉద్యోగులకు ఊరటగా మారిందని చెప్పాలి. తీర్పులో ఉన్న ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి ప్రజలను లంచం అడగడం ఏమంత తప్పు కాదని, కానీ ప్రజలు లంచాన్ని ఇచ్చి అధికారి పుచ్చుకుంటే మాత్రం తప్పుగా పరిగణించి తగిన చర్యలు తీసుకుంటామని కోర్ట్ స్పష్టం చేసింది.
వాస్తవానికి నూటికి తొంబై తొమ్మిది మంది లంచాన్ని డిమాండ్ చేయడంతో పాటు కచ్చితంగా తీసుకునే తీరుతారు. తీసుకునే ఉద్దేశ్యం లేనప్పుడు అసలు అడిగి ఉపయోగం లేదన్నది చాలా మంది అభిప్రాయం. మరి ఈ తీర్పు ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా ఊరట కానున్నది అన్నది తెలియాల్సి ఉంది. అస్సలు... లంచం అడగడం, ఇవ్వడం మరియు తీసుకోవడం అన్నీ కూడా తప్పు కిందకే వస్తుంది.