అమరావతి : జగన్లో పెరిగిపోతున్న గందరగోళం ?

Vijaya





ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ జగన్మోహన్ రెడ్డిలో గందరగోళం పెరిగిపోతున్నట్లే ఉంది. లేకపోతే కొత్తగా పార్టీలో అబ్జర్వర్ల నియామకం ఏమిటి ? ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక అబ్జర్వర్ ను నియమించబోతున్నారు. ఈ విషయమై కసరత్తు చేసే బాధ్యత సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డికి అప్పగించారు. బహుశా డిసెంబర్ మొదటివారంలోగా అబ్జర్వర్ల నియామకం పూర్తయ్యే అవకాశాలున్నాయని పార్టీవర్గాలు చెబుతున్నాయి.



ఇంతకీ కొత్తగా అబ్జర్వర్లు ఏమిచేస్తారు ? ఏమిచేస్తారంటే నియోజకవర్గాల్లో పార్టీ పరిస్ధితులపై అధ్యయనంచేస్తారట. తమకు ఎదురైన సమస్యలను గుర్తించాలట. ఎంఎల్ఏల పనితీరు ఎలాగుందనే విషయమై రిపోర్టు అందించాలట. ప్రభుత్వంపై జనాల్లో ఎలాంటి అభిప్రాయాలుందనే విషయమై వివరాలు సేకరించాలట. ఎంఎల్ఏల పనితీరును అబ్జర్వ్ చేయాలట. ఎంఎల్ఏల్లోని లోటుపాట్లను గుర్తించి నివేదిక తయారుచేయాలట. ప్రభుత్వ కార్యక్రమాలు సరిగా అమలవుతున్నది లేనిది గమనించాలట. ఇప్పటికే ఈ పనుల మీద చాలామందే ఉన్నారు. 



అంతాబాగానే ఉందికానీ ఈ పనులు చేయటానికి కొత్తగా అబ్జర్వర్ల వ్యవస్ధ ఎందుకనేదే అసలైన ప్రశ్న. ఎందుకంటే ఇప్పటికే పార్టీలో జిల్లాల అధ్యక్షులున్నారు. జిల్లా అంతా తిరిగి పైన చెప్పిన పనులే చేస్తున్నారు. జిల్లాల అధ్యక్షులు తమ బాధ్యతలను సక్రమంగా చేస్తున్నారా లేదా అని చెక్ చేయటానికి రీజనల్ కోఆర్డినేటర్లున్నారు. వీళ్ళు కాకుండా ప్రభుత్వ పరంగా ఇంటెలిజెన్స్ వ్యవస్ధ ఎలాగూ ఉంది. ఇవన్నీ సరిపోదన్నట్లు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్  ఐప్యాక్ బృందం ప్రతి నియోజకవర్గంలో  ఇదేపనిలో బిజీగా ఉంది. దీనికి అదనంగా ఐప్యాక్ నుండి ప్రత్యేకంగా ఒక వ్యక్తిని జగన్ ప్రతి ఎంఎల్ఏకి అటాచ్ చేశారు.



ఒకపని కోసం ఇంతమంది నియోజకవర్గాల్లో ఒకేపనిని చేస్తున్నపుడు మళ్ళీ కొత్తగా అబ్జర్వర్లు ఏమిచేస్తారు ? అంటే ‘మందెక్కువైతే మజ్జిగ పలచనైంద’నే సామెతలాగ తయారైపోతుంది జగన్ ప్రయోగం. పార్టీలో గందరగోళం సృష్టించేందుకు తప్ప జగన్ ప్రయోగం ఇంకెందుకు పనికిరాదు. అసలు పార్టీలో ఇంత గందరగోళం జరుగుతోందంటే జగన్లోనే గందరగోళం పెరిగిపోతోందని అర్ధమైపోతోంది. 





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: