అమరావతి : అచ్చెన్న మాటలతో చంద్రబాబు షాకయ్యారా ?

Vijaya





తిరుపతి పార్లమెంటు ఉపఎన్నిక సందర్భంగా ‘పార్టీ లేదు బొక్కా లేదు’ అని టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ఎంత సంచలనం కలిగించిందో అందరికీ తెలిసిందే. ఎక్కడో హ్యాపీగా టిఫిన్ తింటు ఎవరో  కార్యకర్తతో మాట్లాడుతు పార్టీ లేదు బొక్కాలేదు వచ్చే ఎన్నికల తర్వాత ఎత్తిపోయే పార్టీనే అన్నట్లుగా అచ్చెన్న చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. మళ్ళీ అలాంటి వ్యాఖ్యలు పార్టీ సర్వసభ్య సమావేశంలో చేశారు.



చంద్రబాబునాయుడు సమక్షంలోనే నేతలందరి ముందు అచ్చెన్న మాట్లాడుతు ‘టీడీపీ కోసం ప్రాణాలకు తెగించి పనిచేయటానికి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని అయితే తనతో సహా నేతలే సిద్ధంగా లేరు’ అని చేసిన కామెంట్ మళ్ళీ సంచలనమైంది. నేతలంతా రోడ్లపైకి రావటానికి సిద్ధంగా ఉండాలని, పోరాటాలకు రెడీగా ఉండాలని పిలుపిచ్చారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ 160 సీట్లకన్నా ఎక్కువే సాధిస్తుందని చెప్పారు. శ్రీకాకుళంలో పార్టీ హవా మొదలైందట. మహానాడుతో ఉధృతమైందట. రాయలసీమలో ప్రభంజనమైందట. కర్నూలు జిల్లాలో చంద్రబాబు టూరుతో హిట్టయ్యిందట.



ఒక్క ఛాన్సని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి జనాల మధ్య తగాదాలు పెడుతున్నట్లు మండిపోయారు. అమరావతే రాజధానిగా జగన్ ఆరోజు ఒప్పుకోలేదా ? అంటు నిలదీశారు. ఒప్పుకోలేదని చెబితే తాను ఉరేసుకుని చనిపోవటానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అమరావతిని రాజధానిగా అంగీకరించినట్లు తాము నిరూపిస్తే జగన్ ముక్కును నేలకేసి రాస్తారా అంటు చాలెంజ్ చేశారు.



ఇక్కడ అచ్చెన్న అర్ధంచేసుకోవాల్సిందేమంటే అమరావతిని రాజధానిగా జగన్ షరతులతో ఒప్పుకున్నారు. అంతేకానీ బ్లాంక్ చెక్ ఇచ్చినట్లు అంగీకరించలేదు. జగన్ చెప్పిన షరతులకు చంద్రబాబు విరుద్ధంగా వ్యవహరించారు. పైగా 2019 ఎన్నికల్లో టీడీపీని జనాలు  ఘోరంగా ఓడించారు. చంద్రబాబు నిర్ణయాలను అమరావతితో కలిపి జనాలు తిరస్కరించారు కాబట్టే జగన్ ప్రత్యామ్నాయాన్ని ప్రకటించాల్సొచ్చింది. చంద్రబాబు పాలన కానీ లేదా అమరావతి కాన్సెప్టును కూడా జనాలు యాక్సెప్టు చేసుంటే 2019 ఎన్నికల్లో ఓడగొట్టేవారే కాదు. అందుకనే అధికారంలోకి వచ్చిన జగన్ దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: