పోస్టాఫీసు లో అదిరిపోయే స్కీమ్..భార్యాభర్తలకు మంచి బెనిఫిట్స్..

Satvika
పొదుపు పథకాల కోసం చూస్తున్నారా..నెల నెలా పొదుపు చెస్తె బెస్ట్ బెనిఫిట్స్ వచ్చే ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి.పోస్టాఫీసులో ఎన్నో ఆకర్షణీయమైన పథకాలు ఉన్నాయి. ఇందులో భార్యాభార్తలిద్దరూ నెలనెల సంపాదించే పథకం ఒకటి ఉంది. ఈ పథకం ద్వారా వారు వార్షికంగా రూ.59,400 వరకు రాబడి పొందవచ్చు. ఈ స్కీమ్‌ పేరు పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌. ఈ స్కీమ్‌ ద్వారా ప్రతినెల గరిష్టంగా ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్‌ ద్వారా నెలనెల రూ.4950 వరకు పొందవచ్చు.ఇక ఆలస్యం ఎందుకు ఈ స్కీమ్ గురించి పూర్తీ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ కింద భార్య, భర్త ఇద్దరూ ప్రతినెల కొంత డబ్బులు పొందవచ్చు. ఈ పథకంలో చేరితే జాయింట్‌ అకౌంట్‌ను తెరవవచ్చు. జాయింట్ అకౌంట్ ద్వారా అయితే ఈ అకౌంట్లో డబ్బులు రెట్టింపు అవుతాయి. ఈ పథకంలో కనీసం రూ.1000 ఇన్వెస్ట్‌మెంట్‌ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా నాలుగున్నర లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఒక వేళ జాయింట్‌గా అకౌంట్‌ను తీసినట్లయితే గరిష్టంగా రూ.69 లక్షల వరకు డిపాజిట్‌ చేసుకోవచ్చు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు, సీనియర్‌ సిటిజన్లకు ఈ స్కీమ్‌ ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ స్కీమ్‌ కింద పోస్టాఫీసులో ఇద్దరు లేదా ముగ్గురు కలిసి జాయింట్‌ అకౌంట్‌ను తెరవవచ్చు.

అయితే జాయింట్‌ అకౌంట్‌ తీసిన తర్వాత ఏ సమయంలోనైనా సింగిల్‌గా మార్చుకునే వెసులుబాటు ఉంది. అలాగే సింగిల్ అకౌంట్‌ను జాయింట్ అకౌంట్‌గా కూడా మార్చుకునే సదుపాయం ఉంది..ఈ స్కీమ్ ఇన్వెస్ట్‌మెంట్‌ చేసిన వారికి వార్షికంగా 6.6 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. మీ డిపాజిట్లపై పొందిన వార్షిక వడ్డీరేటు ఆధారంగా లెక్కిస్తారు. ఉదాహరణకు మీరు జాయింట్‌ అకౌంట్‌లో రూ.9 లక్షలు డిపాజిట్‌ చేస్తే మొత్తం వడ్డీ కలుపుకొని ఏడాదికి రూ.59,400 అందుకుంటారు. ఈ మొత్తాన్ని 12 భాగాలుగా విభజిస్తే ప్రతి నెల రూ.4950 అందుకోవచ్చు. పథకం మెచ్యూరిటీ ఐదేళ్లు..ఇంకా కూడా పథకం సమయం పెంచుకోవచ్చు...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: