ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే లక్షలు పొందొచ్చు... ఎలాగంటే?

Satvika
కేంద్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కొన్ని స్కీమ్ లను కూడా అందిస్తూ వస్తుంది..అందులో కొన్ని సేవింగ్స్‌ కు బెస్ట్..మరికొన్ని భీమా ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఆరోగ్య భద్రత విషయంలో కూడా బీమా యోజన పథకాలను ప్రవేశపెడుతోంది..ప్రధాని ప్రవేశ పెట్టిన పథకాల్లో ఆర్థిక భద్రత కల్పించే స్కీమ్‌లో కూడా ఎన్నో ఉన్నాయి. వీటిల్లో చేరడం వల్ల కుటుంబానికి ఆర్థిక భద్రత లభిస్తుంది. అటువంటి పథకాలలో ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై) ఒకటి. ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తూ మరణిస్తే.. వారి కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకునేందుకు ఉపయోగపడుతుంది.


ఈ సురక్ష బీమా యోజన స్కీమ్‌లో సంవత్సరానికి రూ.20 చెల్లిస్తే రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుంది. సురక్ష బీమా యోజన అనేది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఇందులో చేరాలంటే బ్యాంకులు, పోస్టాఫీసులకు వెళ్లి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బీమా పాలసీ తీసుకుంటే పాలసీదారులు ఆటో డెబిట్‌ ఆప్షన్‌ పెట్టుకుంటే వారి అకౌంట్‌ నుంచి ప్రతి ఏడాది రూ.20 ఖాతా నుంచి నేరుగా కట్‌ అవుతాయి. స్కీమ్‌లో ఉన్న వారు ప్రమాదవశాత్తు మరణిస్తే.. వారి కుటుంబాలకు రూ.2 లక్షల వరకు డబ్బులు లభిస్తాయి. అదే పాక్షికంగా అంగ వైకల్యం సంభవిస్తే రూ.1 లక్ష వరకు వస్తాయి.


శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే రూ.2 లక్షలు లభిస్తాయి. 18 ఏళ్ల నుంచి 70 ఏళ్లలోపు ఈ ప్రధాన్ మంత్రి సురక్ష బీమా స్కీమ్‌లో చేరవచ్చు..ఈ స్కీమ్ కోసం దగ్గరిలోని బ్యాంక్‌కు వెళ్లి అంటే మీకు బ్యాంక్ అకౌంట్ ఉన్న బ్రాంచుకు వెళ్లి ప్రధాన్ మంత్రి సురక్ష బీమా స్కీమ్‌లో చేరవచ్చు. ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అయ్యేందుకు అనుమతి ఇవ్వాలి. 70 ఏళ్లు దాటితే ఈ స్కీమ్ వర్తించదు. అలాగే ఎలాంటి డబ్బులు కూడా లభించవు. ఈ పాలసీ జూన్ 1 నుంచి మే 31 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రతి సంవత్సరం మే 31కి ముందు ప్రీమియం మొత్తం బ్యాంకు ఖాతా నుంచి కట్ అవుతుంది.పాలసిని ముగిస్తె అకౌంట్ క్లోజ్ అవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: