దేవీ నవరాత్రులు.. చీర కట్టుకున్న పురుషులు.. ఎందుకంటే?

praveen
సాధారణంగా దసరా నవరాత్రి ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ ఎంత అంగరంగ వైభవంగా జరుపుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దసరాకి సరిగ్గా తొమ్మిది రోజుల ముందు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి ఇక ప్రతిరోజు ఎంతో నిష్టగా పూజలు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక దేవి నవరాత్రులను ప్రతిరోజు ఒక్కో విధంగా సెలబ్రేట్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం అందరూ దేవీ నవరాత్రులను సెలెబ్రేట్ చేసుకున్నప్పటికీ ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 ఇక ఆయా ప్రాంతాల్లో ఉన్న ఆచారం ప్రకారమే మగవారు ఆడవారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఆచారాన్ని పాటిస్తూ చివరికి అమ్మవారికి పూజలు నిర్వహిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఆచరించే వింత సాంప్రదాయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక సరికొత్త ఆచారం గురించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఏకంగా దేవీ నవరాత్రి పూజలో భాగంగా పురుషులు మహిళల లాగా చీరలు కట్టుకొని పూజలు చేస్తారట.

 గుజరాత్ లోని వడోదర అహ్మదాబాద్ ప్రాంతాలలో ఇక ఆచారం ఇక ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తుందని అక్కడి స్థానికులు చెబుతున్నారు. దాదాపు 200 ఏళ్ల నుంచి కూడా ఇప్పటివరకు పురుషులు చీర కట్టుకొని గుడి ముందు నృత్యం చేస్తూ అమ్మవారిని కొలుస్తూ ఉంటారట. అయితే శాప విమోచనం కోసమే బరోట్ కమ్యూనిటీ పురుషులు స్త్రీ వేషధారణలో డాన్స్ చేస్తూ ఉంటారట. ఇక ఇలా పురుషులు చీర కట్టుకొని అమ్మవారి ముందు డాన్స్ చేయడం ద్వారా శాప విమోచనం జరగడంతో పాటు ఇక అమ్మవారి కృప కటాక్షాలు తమపై ఉంటాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు అంటూ స్థానికులు చెబుతూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: