రాయలసీమ : చంద్రబాబును దెబ్బకొట్టేందుకు సరికొత్త వ్యూహం

Vijaya






వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబునాయుడును ఓడించటమే టార్గెట్ గా జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందుకోసం అందుబాటులో ఉన్న ప్రతి పాచికను విసురుతున్నారు. తాజాగా కుప్పం పర్యటనలో చంద్రబాబుకు వ్యతిరేకంగా మూడు, నాలుగు పాచికలను జగన్ ఒకేసారి విసిరారు. ఇపుడు జగన్ విసిరిన పాచికలు గనుక వర్కవుటైతే చంద్రబాబు గెలుపు కష్టమనే అనుకోవాలి.



ఇంతకీ విషయం ఏమిటంటే మొదటిది సామాజికవర్గాల సమీకరణలు. నిజానికి కుప్పంలో మెజారిటీ జనాలు బీసీలు తర్వాత ఎస్సీలు. ఆ తర్వాతే మిగిలిన సామాజికవర్గాలు. బీసీల్లో కూడా వన్నెకుల క్షత్రియులు చాలా ఎక్కువ. ఈ వర్గానికి చెందిన వ్యక్తే ఎంఎల్సీ భరత్. అందుకనే జగన్ ఏరికోరి వచ్చే ఎన్నికల్లో భరత్ కు ఎంఎల్ఏ టికెట్ కేటాయించింది. ఈ వర్గంలో భరత్ కుటుంబానికి మంచిపట్టుంది. ఇక రెండో పాచిక ఏమిటంటే స్ధానికత అంశం. చంద్రబాబు హైదరాబాద్ కు లోకల్..కుప్పానికి నాన్ లోకల్ అని జనాలకు అర్ధమయ్యేట్లుగా చెప్పారు.



లోకల్ కాబట్టే చంద్రబాబు హైదరాబాద్ లో ఉంటు కుప్పం అభివృద్ధిని గాలికొదిలేసినట్లు పదే పదే చెప్పారు. ఇది కూడా వాలీడ్ పాయింట్ అనే అనుకోవాలి. ఇక మూడో పాచిక ఏమిటంటే తన ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని ఒకటికి పదిసార్లు ప్రస్తావించారు. తాను చెప్పినదాన్ని ఆచరణలో చూపిస్తున్నట్లుగా ఉదాహరణలు కూడా చెప్పారు.




చివరి పాచిక ఏమిటంటే జగన్ సుమారు గంటపాటు వేదికమీదున్నారు. ఈ గంటసేపటిలో జగన్ తో పాటు మంత్రి రోజా, ఎంఎల్సీ భరత్ తప్ప మరో నేతే కనబడలేదు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్, ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, ఇతర ఎంఎల్ఏలు, నేతలు ఎవరూ వేదికమీద కనబడలేదు. పైగా లోకల్ గా ఉండే మహిళల్లో కొందరిని మాత్రమే వేదిక మీద తనతో పాటు కూర్చోబెట్టుకున్నారు. ఇదే చంద్రబాబు అయితే వేదికమీద మొత్తం మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలు, నేతలతోనే నిండిపోయేది. మామూలు జనాలను అసలు వేదిక దగ్గరకు కూడా రానిచ్చేవారు కాదు. మొత్తానికి చంద్రబాబుకు వ్యతిరేకంగా మహిళలు, బీసీకార్డు, లోకల్-నాన్ లోకల్, లాంటి పాచికలు వేస్తున్నట్లు అర్ధమైపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: