పాట్నా : బీజేపీ దెబ్బకు లబోదిబోమంటున్న నితీష్
బీహార్లో విడిపోయాక బీజేపీ-నితీష్ కుమార్ ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు ఒకరిపై మరొకరు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటున్నారు. ఒకసారి నితీష్ కుమార్ ది పైచేయి అయితే మరోసారి బీజేపీది అప్పర్ హ్యాండ్ అవుతోంది. తాజాగా నితీష్ కు బీజేపీ పెద్ద షాకే ఇచ్చింది. ఎలాగంటే మణిపూర్లో జేడీయూ ఎంఎల్ఏలను ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాలని నితీష్ డిసైడ్ అయ్యారు. మణిపూర్ సంకీర్ణప్రభుత్వంలో బీజేపీతో పాటు జేడీయూ కూడా కలిసుంది.
తమ మద్దతును ఉపసంహరించటం ద్వారా బీజేపీకి పెద్ద షాక్ ఇవ్వాలని నితీష్ అనుకున్నారు. అనుకున్నట్లుగానే జేడీయూ ఎంఎల్ఏలు సంకీర్ణప్రభుత్వం నుండి బయటకు వచ్చేశారు. అయితే ఆ తర్వాతే నితీష్ కు అసలు షాక్ తగిలింది. ఎలాగంటే జేడీయూకి చెందిన ఆరుగురు ఎంఎల్ఏల్లో ఐదుగురు బీజేపీలో చేరిపోయారు. మణిపూర్లో తమదే అసలైన జేడీయూ అని చెప్పిన ఐదుగురు ఎంఎల్ఏలు తమ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి స్పీకర్ ఆమోదం తెలిపి ఐదుగురు ఎంఎల్ఏల జేడీయూని బీజేపీలో విలీనం చేసినట్లు ప్రకటించేశారు కూడా.
గతంలో అంటే 2019లో అరుణాచల్ ప్రదేశ్ లో కూడా నితీష్ కుమార్ కు బీజేపీ ఇలాగే చేసింది. ఈ రాష్ట్రంలో ఉన్న ఆరుగురు ఎంఎల్ఏల్లో ఐదుగురిని తమ పార్టీలో చేర్చేసుకున్నది బీజేపీ. బీజేపీ-నితీష్ మధ్య సమస్య మొదలైంది ఇక్కడే. మిత్రపక్షం ఎంఎల్ఏలని కూడా బీజేపీ చూడకుండా అవకాశమున్న ప్రతి రాష్ట్రంలోను తమలో కలిపేసుకుంటున్నారు.
అరుణాచల్ ప్రదేశ్ దెబ్బకు నితీష్ మేల్కొన్నట్లే ఉన్నారు. తర్వాత బీహార్లో జరిగిన ఎన్నికల్లో మైనర్ పార్టనర్ గా ఉండి సీఎం అయ్యారు. అయితే జేడీయూ ఎంఎల్ఏలతో కూడా బీజేపీ అగ్రనేతలు టచ్ లో ఉన్నారు. దాంతో జేడీయూని బీహార్లో కూడా బీజేపీ చీల్చేస్తుందని భయపడ్డారు. మహారాష్టలో జరిగిన పరిణామాలతో మేల్కొన్న నితీష్ బీహార్లో బీజేపీని దెబ్బకొట్టి ప్రభుత్వంలో నుండి బయటకు తోసేశారు. అప్పటినుండి నితీష్ పై బీజేపీ కసిపెంచుకున్నది. అందుకనే దెబ్బకు దెబ్బ తీసుకుంటున్నారు ఇద్దరు.