పవన్ కళ్యాణ్ తప్పటడుగు వేస్తున్నాడా?
ఇంతకీ విషయం ఏమిటా అని చూస్తే... వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటును వదలము అని చెబుతూ వస్తున్న పవన్... రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలను గమనిస్తే పవన్ వ్యతిరేక ఓటును గాలికి వదిలేస్తున్నారని క్లియర్ గా అర్ధం అవుతోంది. ఎందుకంటే ఏపీలో ఉద్యోగ సంఘాలు సీఎం జగన్ పై గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా సిపీఎస్ ఫించన్ ను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అందులో భాగంగా మరో రెండు రోజుల్లో సీఎం ఇంటి ముట్టడికి మరియు మిలియన్ మార్చ్ కు సిద్ధం అవుతున్నారు. అయితే ఇంత జరుగుతున్న రాష్ట్రంలో ఏ ఒక్క పార్టీ కూడా తమకు మద్దతు గా నిలబడడం లేదని వాపోతున్నారు. కానీ అందరికీ మేమున్న అంటూ చెప్పుకుంటున్న పవన్ వీరి పరిస్థితిని ఎందుకు పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో పవన్ తప్పటడుగు వేస్తున్నారని... అలా కాకుండా ఒక్కమాట ఉద్యోగులకు అండగా మేమున్నాం అంటూ అంటే వారి తరపున వచ్చే 4 లక్షల ఓట్లు జనసేనకు వస్తాయి. ఈ విషయంపై త్వరితగతిన స్పందించాలి.