రాయలసీమ : ఈ ఎంపీ సంగతి అంతేనా ?

Vijaya


హిందుపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వివాదంలో తగులుకున్నారు. ఎవరో ఒక మహిళతో ఎంపీ నగ్నంగా మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో  వైరల్ అయ్యింది. వీడియో వెలుగుచూసిన వెంటనే ఎంపీ స్పందించారు. ఎంపీ మీడియాతో మాట్లాడుతు కావాలనే తనపై బురదచల్లేందుకు టీడీపీ, ఎల్లోమీడియానే దుష్ప్రచారానికి దిగిందన్నారు. తాను ఏ మహిళతోను అలా మాట్లాడలేదన్నారు.
తాను జిమ్ లో ఎక్సర్ సైజులు చేస్తున్నపుడు ఎవరో వీడియోను తీసి అసభ్యంగా మార్ఫింగ్ చేసినట్లు మండిపడ్డారు. చింతకాయల అయ్యన్నపాత్రుడి కొడుకు చింతకాయల విజయ్ తో మరో ఇద్దరిపై తాను ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఎల్లోమీడియాపై ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదుచేయటంతో పాటు సుప్రింకోర్టులో పిటీషన్ దాఖలు చేస్తానని హెచ్చరించారు. సరే ఎంపీ ఎలాగూ ఫిర్యాదుచేశారు కాబట్టి సదరు వీడియో మార్ఫింగ్ చేసిందా లేకపోతే ఒరిజనలేనా అని తేలుస్తారు.
ఇదే విషయమై సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతు ఎంపీ ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తుచేస్తున్నట్లు చెప్పారు. వీడియో మార్ఫింగ్ కాదని తేలితే కచ్చితంగా ఎంపీపై చర్యలుంటాయని హెచ్చరించారు. ఇలాంటి చర్యలను పార్టీ ఏమాత్రం సహించదని చెప్పారు. అంతాబాగానే ఉందికానీ ఎంపీకి మద్దతుగా పార్టీనుండి కనీసం ఒక్కరంటే ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేదు. జిల్లాలో మంత్రులు, ఎంఎల్ఏలు కూడా మద్దతుగా నిలవలేదు. పైగా వీడియో ఒరిజనలని తేలితే చర్యలుంటాయని సజ్జల వార్నింగ్.జరుగుతున్నది చూస్తుంటే మాధవ్ పై కచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. పార్టీనుండి సస్పెండ్ చేయటమా ? లేకపోతే అసలు ఎంపీగానే రాజీనామా చేయించటమా అనేది తొందరలోనే తేలిపోతుంది. తొందరలోనే రాబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఎంపీపై చర్యలు తీసుకోవాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచిస్తున్నారట. ఒకవేళ వీడియో మార్ఫింగ్ అని తేలితే మాత్రం ఎల్లోమీడియా, ఫేక్ వీడియో సూత్రదారులపై అంతేస్ధాయిలో చర్యలు తీసుకోవాలని కూడా జగన్ ఆదేశించారట. మరి పోలీసులు ఎంత సీరియస్ గా స్పందిస్తున్నారనే విషయంపైనే మొత్తం ఎపిసోడ్ ఆధారపడుంది.  మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: