819 మంది సైనికులు ఆత్మహత్య.. షాకింగ్ విషయం చెప్పిన కేంద్రం?

praveen
దేశానికి అన్నం పెట్టే రైతన్న దేశ సరిహద్దుల్లో పహారా కాస్తూ దేశానికి రక్షణ కల్పిస్తున్న సైనికులు ఎప్పటికీ గొప్పవారే అన్నది పెద్దలు చెప్పే మాట. నిజంగానే భారత సైనికులు కుటుంబాలకు దూరంగా ఉంటూ కట్టిన పరిస్థితుల మధ్య దేశానికి రక్షణ కల్పిస్తూ ఉండటం మనం మాట్లాడుకున్నంత  ఆషామాషీ విషయం కాదు. ఎందుకంటే సరిహద్దుల్లో ఎప్పుడు ఎటు వైపు నుండి శత్రువుల దాడి చేస్తారో కూడా తెలియని పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో మంచు పేరుకుపోయి  ఎముకలు కొరికే చలి ఉంటే మరికొన్ని ప్రాంతాల్లో ఎండలకు శరీరం కాలిపోతుందేమో అన్న పరిస్థితి ఉంటుంది.



 సరిహద్దుల్లో విలాసవంతమైన భవనాలు ఉండవు.. చీకటి పడిందంటే  చాలు ఎక్కడో ఒకచోట తలదాచుకోవడమె.. తుపాకి శబ్దం వినిపించింది అంటే చాలు ఉలిక్కిపడి లేచి దేశ భద్రత కోసం మళ్ళీ చేతిలో ఆయుధం పట్టుకొని అప్రమత్తం కావడమె. ఇదే సరిహద్దుల్లో సైనికులు చేసే పని. ఇంత ఒత్తిడిలో కూడా దేశానికి రక్షణ కల్పించడం ఎంతో గౌరవంగా భావిస్తూ ఉంటారు సైనికులు. కుటుంబాలకు దూరంగా కఠిన పరిస్థితుల మధ్య  ఆయుధాలు పట్టుకుని రాత్రి పగలు తేడా లేకుండా సరిహద్దులో సైనికులు పహారా కాస్తున్నారు కాబట్టే దేశం నడిబొడ్డున మనం హాయిగా నిద్రపోతున్నాము అని చెప్పాలి.


 అయితే సరిహద్దుల్లో పహారా కాయడం అన్నది తీవ్ర ఒత్తిడితో కూడుకున్న పని. ఈ క్రమంలోనే ఎంతోమంది సైనికులు డిప్రెషన్ కి లోనవటం  జరుగుతూ ఉంటుంది. అయితే ఇలా ఇప్పటి వరకు ఎంతో మంది సైనికులు ఆత్మహత్య చేసుకున్నారని ఇటీవలే  వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. గడిచిన ఐదేళ్లలో 819 మంది సైనికులు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపింది. ఆర్మీలో 642 మంది ఐఎఫ్ఎఫ్ లో 148 మంది, ఇండియన్ నేవీలో 29 మంది జవానులు ప్రాణాలు తీసుకున్నారట. ఈ క్రమంలోనే ఒత్తిడి ఆత్మహత్యకు సంబంధించిన మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్స్ సైనికులు నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఎక్కువ ఒత్తిడికి గురయ్యే సైనికులలు కమాండింగ్ ఆఫీసర్,  రిజిమెంటల్ మెడికల్ ఆఫీసర్లు కూడా కౌన్సిలింగ్ ఇవ్వబోతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: