గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద పరిస్థితి ఇది?

praveen
గత కొన్ని రోజుల నుంచి ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యం లో తెలంగాణ రాష్ట్రం లోని ఎన్నో ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ముఖ్యం గా నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు వరదల నేపథ్యం లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమం లోనే భారీ వరదలు ముంచెత్తిన నేపథ్యం లో  నది పరివాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.


 కుండపోత వర్షాల నేపథ్యం లో ప్రస్తుతం తెలంగాణ లోని ప్రాజెక్టులు అన్నీ కూడా జలకళను సంతరించుకున్నాయి. నిండు కుండలా కనిపిస్తున్నాయి. అదే సమయం లో ఎన్నో నగరాలు జలదిగ్బంధంలో కి వెళ్లి పోతున్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఇక ఇలా వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అందరూ కూడా ఇళ్లలోకి నీరు వచ్చి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో ఇక ప్రస్తుతం భద్రాచలం ఆలయం వద్ద కూడా గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది అన్నది తెలుస్తుంది.



 ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల తో పాటు అటు రాష్ట్రంలో పడుతున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నదికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలోనే భద్రాచలం వద్ద గోదావరి నీటి ప్రవాహం ఏకంగా 49 అడుగులకు చేరింది అని తెలుస్తుంది. అయితే ఇప్పటికే భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో  ప్రమాద  హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ఇక ఇప్పుడు నీటి ప్రవాహం 49 అడుగులకు చేరిన నేపథ్యంలో అధికారులు మరోసారి అప్రమత్తమయ్యారు. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు  లోతట్టు ప్రాంతాల ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ అధికారులు సూచించారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో కంటి మీద కునుకు లేకుండా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: