అమరావతి : నోటిదూల అలాగే కంటిన్యు అవుతోందా ?

Vijaya



సినిమాల్లో కమెడియన్ పృథ్విరాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయటం అవసరంలేదు. వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరిన తర్వాత మళ్ళీ సినిమాల్లో బిజీ అయిపోతున్నారు. ఈ నేపధ్యంలోనే ఎల్లోమీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో అడ్డు అదుపులేకుండా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఇంతకీ కమెడియన్ చెలరేగిపోయింది ఎవరిమీదంటారా ? ఇంకెవరిమీద జగన్మోహన్ రెడ్డి, వైసీపీపీ పైనే.




ఇంతకీ కమెడియన్ ఏమన్నారంటే వైసీపీ అనే పార్టీ ఉగ్రవాదులకు శిక్షణిచ్చే పార్టీనట. కాపులంటే జగన్ కు ఏమాత్రం పడదట. తనపేరు వెనకాల రెడ్డి అనుంటే తనకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తేది కాదట. వైసీపీలో ఉన్నపుడు కళ్ళుమూసుకుపోయి, కొవ్వెక్కి, నోటిదూల కారణంగా చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ను ఇష్టమొచ్చినట్లు మాట్లాడానని అంగీకరించారు. అప్పట్లో తనకు కళ్ళుమూసుకుపోయినట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమట.



అంతాబాగానే ఉందికానీ వైసీపీలో ఉన్నపుడే కాదు ఇపుడు కూడా నోటిదూల ఏమీ తగ్గలేదని అర్ధమైపోతోంది. ఎందుకంటే వైసీపీలో ఉన్నపుడు చంద్రబాబు, పవన్ పై మాట్లాడినట్లే ఇపుడు జనసేనలో చేరి జగన్ను మాట్లాడుతున్నారు. పైగా ఎల్లోమీడియా ఇంటర్వ్యూ కదా మరింత నాటకీయంగా రెచ్చిపోయి సెటైర్లు వేస్తు జగన్+వైసీపీపై నోటికొచ్చింది మాట్లాడేశారు.



నిజానికి ఈ కమెడియన్ కన్నా ముందునుండే వైసీపీలో ఉన్న సినిమా వాళ్ళని కాదని ఎస్వీబీసీ ఛానల్ కు ఛైర్మన్ గా నియమించారు జగన్. అయితే అక్కడి మహిళా ఉద్యోగినులతో అసభ్యంగా ప్రవర్తించి, మాట్లాడి ఆడియో బయటపడటంతో కమెడియన్ తో జగన్ రాజీనామా చేయించారు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించమని, మాట్లాడమని పృధ్వికి ఎవరు చెప్పారు ? ఇక్కడే కమెడియన్ నోటిదూల అర్ధమైపోతోంది.




తన నోటిని అదుపులో పెట్టుకోలేని కమెడియన్ తనతో రాజీనామా చేయించినందుకు జగన్ను తప్పుపట్టడమే విచిత్రంగా ఉంది. తనను పిలిచి జగన్ మళ్ళీ ఏదో పదవి ఇస్తారని అనుకున్నట్లున్నారు. అలా జరగకపోయేసరికి ఇక లాభంలేదని అర్ధమైపోయి పార్టీనుండి బయటకు వచ్చేశారు. ఎప్పుడైతే బయటకు వచ్చేశారో అప్పటినుండి జగన్ పై నోరుపారేసుకుంటున్నారు. అప్పుడే కాదు ఇఫుడు కూడా కమెడియన్ నోటిదూల ఏమీ తగ్గలేదని అర్ధమవుతోంది. నోటిని అదుపులో పెట్టుకోకపోతే ఏ పార్టీలో అయినా ఉండటం కష్టమే అని అర్ధంకాకపోవటమే విచిత్రం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: