'చాప కింద నీరులా' సోకుతున్న కరోనా... మేల్కోండి ?

VAMSI
కరోనా విలయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి ప్రభావం అయితే తగ్గింది కానీ వ్యాప్తి మాత్రం వేగంగా ఉంది. గత కొద్ది రోజులుగా కరోనా వ్యాప్తి బాగా పెరిగిపోయింది. నిత్యం లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. ఆరోగ్య పరంగా దీర్ఘ కాలిక వ్యాధులు వుండే వారు కొద్దిగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. కానీ మిగిలిన వారికి పెద్దగా ఇబ్బంది అయితే తలెత్తడం లేదు అని తెలుస్తోంది. కానీ కరోనా ఇప్పటికీ ఈ భూమి పైనే ఉన్నందున ఎపుడు ఎలా ఇబ్బంది పెడుతుందో అన్నది ఊహించలేమని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు శాస్త్రవేత్తలు. మరి కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టినా వ్యాప్తి మాత్రం ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.
అందులోనూ గత కొద్ది రోజులుగా వ్యాప్తి వేగం మరింత పెరిగింది. ఇక తాజా కరోనా గణాంకాలు ఇలా ఉన్నాయి.  
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా దాదాపు 13,313 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు రికార్డ్ అయినట్లు హెల్త్ బులిటెన్ విడుదల చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. గత రేడు రోజుల ముందుకు ఏ రోజుటికి కరోనా కేసుల సంఖ్య పెరిగింది.  
ఆ లెక్కన చూసుకుంటే ఈ రోజు 2,374 కేసులు నమోదు కాగా ... మొత్తం కోవిడ్ యాక్టివ్‌ కేసుల సంఖ్య 81,687కు చేరింది. అయితే బుధవారం నాడు కరోనా కేసుల సంఖ్య ఏకంగా 13 వేల మార్కును దాటింది. గడిచిన 24 గంటల్లో 38 మంది కోవిడ్‌తో మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనా మృతుల  సంఖ్య 5 లక్షల 24 వేల 941కు చేరుకుంది.
దేశంలో కరోనా వ్యాక్సిన్ ల పంపిణీ కొనసాగుతోంది.
ఈ లెక్కలు చూస్తుంటే కరోనా ఫోర్త్ వేవ్ వచ్చేసిందని వార్తలు వస్తున్నాయి. ఇక అలక్ష్యం చేస్తే సమస్య మరింత కఠినంగా మారే అవకాశం ఉందని... కాబట్టి ప్రజలు మరియు ప్రభుత్వాలు కలిసి కట్టగా ఉండి... ఈ కరోనా బారి నుండి బయటపడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: