అమరావతి : ఇంత అయోమయాన్ని జనాలు భరించగలరా ?

Vijaya



జనసేన అధినేత పవన్ కల్యాణ్ అయోమయంలో ఉన్నారా ? లేకపోతే పార్టీ నేతలను, జనాలను అయోమయంలోకి నెట్టేస్తున్నారా ? ఇపుడిదే ప్రశ్న హాట్ టాపిక్ అయిపోయింది. ఈ ప్రశ్న ఎలాగుందంటే చెట్టుముందా విత్తుముందా అన్న ప్రశ్నలాగుంది. పార్టీ నేతలతో జరిగిన విస్తృతస్ధాయి సమావేశాల్లో ఒకలాగ మాట్లాడుతారు. ప్రెస్ మీట్లో మరోరకంగా మాట్లాడుతారు. బహిరంగసభల్లో ఇంకోరకంగా మాట్లాడుతారు.



ఒకే అంశంగా ఇన్నిరకాలుగా మాట్లాడుతున్నారు కాబట్టే పవన్ను అపరిచితుడని ముద్దుగా జనాలు పిలుచుకుంటున్నారు. ఎవరెంత ముద్దుగా పిలుచుకుంటున్నా పవన్ వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు రావటంలేదు. రెండువారాల క్రితం పార్టీ నేతలతో మాట్లాడినపుడు ఇటు బీజేపీ అటు తెలుగుదేశంపార్టీకి మూడు ఆప్షన్లిచ్చారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయటం. బీజేపీ+జనసేన+టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయటం. చివరి ఆప్షన్ ఏమిటంటే జనసేన ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయటం.



ఇప్పటికే బీజేపీతో పొత్తుల్లో ఉన్న పవన్ కు టీడీపీతో కూడా పొత్తు పెట్టుకోవాలని బలంగా ఉంది. అలా సాధ్యంకాదంటే అవకాశముంటే బీజేపీని వదిలేసి టీడీపీతో కలిసి పోటీచేయాలనుంది. ఈ విషయాన్ని పవనే చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేకఓట్లు చీలినిచ్చేప్రసక్తేలేదని బహిరంగసభలో చెప్పిందానికి అర్ధమిదే. ఢిల్లీకి వెళ్ళి టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరాన్ని కూడా అగ్రనేతలకు చెప్పేందుకు ప్రయత్నించి ఫెయిలై తిరిగొచ్చేశారు.




ఇపుడేమో హఠాత్తుగా జనంతోనే తనకు పొత్తు తప్ప ఇతర ఏ పార్టీలతోను లేదని ప్రకటించారు. పోనీ అదేమాట మీదున్నారా అంటే లేదు. వెంటనే పొత్తులగురించి ఇపుడు మాట్లాడనని చెప్పారు. దీని అర్ధమేమిటంటే సమయం వచ్చినపుడు పొత్తులపై చర్చిస్తామని, పొత్తులు పెట్టుకుంటామని. మరిప్పటికే పొత్తున్న బీజేపీ పరిస్ధితి ఏమిటి ? ఇంత గందరగోళంగా, అయోమయంగా ఉన్న పవన్ కల్యాణ్ ను జనాలు ఎలా భరించగలరు ? ఏ విషయంలో కూడా స్ధిరమైన అభిప్రాయంలేని, రోజుకో మాట మార్చే వ్యక్తిని జనాలు ఆదరిస్తారా ? ఒకటికి చెప్పి మరురోజు మరోకటి ఆచరించే వ్యక్తిని అసలు రాజకీయాల్లో రాణించగలరా ? ఇవన్నీ ఇపుడు జనాల్లో నలుగుతున్న చర్చలు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: