గుంటూరు జిల్లాలో రైలు ప్రమాదం! పిల్లలు,తల్లి మృతి!

Purushottham Vinay
గుంటూరు జిల్లా నడికుడి రైల్వే స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న రైలు ప్రమాద ఘటనలో ఓ తల్లి ఇంకా ఆమె ఇద్దరు పిల్లలతో సహా మృతి చెందడం విషాదంగా మారింది. మృతులు నల్గొండ జిల్లా వాసులు కావడంతో నల్గొండలో స్థానికంగా విషాద ఛాయలు అనేవి అలముకున్నాయి.ఇక ఈ ఘటన వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా నడికుడి రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం నాడు రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. రైలు పట్టాలు దాటుతుండగా ఫలక్నామ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టడంతో ఆ ఇద్దరు పిల్లలతో సహా తల్లి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.ఇక నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని నార్కట్పల్లి మండలం ఔర వాణి గ్రామానికి చెందిన రమ్య ఇంకా తన ఇద్దరు పిల్లలు అయిన ఏడు సంవత్సరాల రిషిక్ రెడ్డి ఇంకా ఐదు సంవత్సరాల హన్సిక రెడ్డి లతోపాటు రైలు ప్రమాద ఘటనలో మృతి చెందింది.ఇక రమ్య తన భర్త గాదె జాన్ రెడ్డితో గత కొన్ని సంవత్సరాలుగా నల్గొండ పట్టణంలోని చైతన్యపురి కాలనీలో నివాసం ఉంటున్నారు. వారి ఇద్దరు పిల్లలు రిషిక్ రెడ్డి ఇంకా హన్సిక రెడ్డి లతో జీవనం సాగిస్తున్నారు.ఆ ఇద్దరు పిల్లలు నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్ లోని ప్రేరణ స్కూల్లో చదువుతున్నారు.


అయితే ఊహించని విధంగా సోమవారం నాడు రాత్రి గుంటూరు జిల్లా నడికుడి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని ఆ తల్లి తో పాటు ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందారు.ఇక ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ రైలు ప్రమాద సమాచారాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. దీంతో రమ్య కుటుంబం అంతా కన్నీరు మున్నీరుగా రోదిస్తుంది.దీనిపై ఇక కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.అయితే ఇక రమ్య గుంటూరు నడికుడి రైల్వే స్టేషన్ వద్దకు ఎందుకు వెళ్ళింది? అది ప్రమాదవశాత్తు జరిగిన ఘటననా? లేక దీని వెనుక మరేదైనా కారణాలు ఉన్నాయా? లేదా రమ్య తన పిల్లలతో పాటు ఆత్మహత్య చేసుకుందా? అసలేం జరిగింది అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా కానీ ఇద్దరు చిన్నారులతో పాటు తల్లి మృతి చెందిన ఘటన స్థానికంగా ఉన్నవారిని ఆవేదనకు గురి చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: