ఢిల్లీ : రాష్ట్రపతి అభ్యర్ధులుగా వీళ్ళు పనికిరారా ?

Vijaya



నాన్ ఎన్డీయే పార్టీలు మరీ ఇంత దరిద్రంలో కొట్టుకుంటున్నాయా ? రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎన్డీయే అభ్యర్ధిగా ఉమ్మడి అభ్యర్ధిని కూడా నిలబెట్టలేనంత ధీనస్ధితిలో కొట్టుకుంటున్నాయా ? ఇలాంటి ప్రతిపక్షాలున్నాయి కాబట్టే నరేంద్రమోడి చాలా కులాసాగా ప్రధాని పదవిని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధి రేసులో నుండి గోపాలకృష్ణగాంధీ కూడా తప్పుకున్నారు. మొదటి శరద్ పవార్ తప్పుకుంటే తర్వాత ఫరూక్ అబ్దుల్లా కూడా విత్ డ్రా అయిపోయారు.



ఇక విపక్షాల ఏకైక దిక్కు గోపాలకృష్ణగాంధీ మాత్రమే అని అందరు అనుకుంటున్న సమయంలో చివరకు ఆయన కూడా అందరికీ ఓ నమస్కారం పెట్టి పక్కకు తప్పుకున్నారు. నిజంగా ఇక్కడే నాన్ ఎన్డీయే పార్టీలు ఎంతటి దరిద్రంలో కొట్టుకుంటున్నాయో అర్ధమైపోతోంది. విచిత్రం ఏమిటంటే వయస్సయిపోయిన దేవగౌడ, ఫరూక్ అబ్దుల్లా, శరద్ తామింకా క్రియాశీల రాజకీయాల్లో ఉండాలని కోరుకుంటున్న కారణంగానే రాష్ట్రపతి అభ్యర్ధులుగా ఉండకూడదని అనుకోవటమే.



సరే వీళ్ళ వ్యవహారం ఎలాగున్నా ఉమ్మడి అభ్యర్ధిని నిలబెట్టాలన్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కోరిక తీరేట్లులేదు. నరేంద్రమోడీ అంటే ఒంటకాలిమీద లేవటం కాదు అందుకు వ్యూహాత్మకంగా వెళ్ళాలన్న ఆలోచన లేకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. అయినా రాష్ట్రపతి అభ్యర్ధి అంటే కేవలం రాజకీయనేతలు మాత్రమే ఉండాలని రూలేమీ లేదుకదా. టాటా గ్రూపుకు ఛైర్మన్ గా పనిచేసిన రతన్ టాటా పనికిరారా ? సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే పేరు ఎందుకు గుర్తుకు రావటంలేదు ? నరేంద్రమోడి లేదా ప్రతిపక్షాలు ఇలాంటి వ్యక్తుల గురించి ఎందుకు ఆలోచించటంలేదో అర్ధం కావటంలేదు.



గతంలో ప్రపంచప్రఖ్యాత సైంటిస్టు ఏపీజే అబ్దుల్ కలాం వల్ల దేశానికి ఎంత పేరొచ్చిందో అందరు చూసిందే. ఇపుడు రతన్ టాటా అంటే ప్రపంచదేశాల్లో కొత్తగా పరిచయటం అవసరంలేని పారిశ్రామికవేత్త అన్న విషయం తెలిసిందే. ఇంతకన్నా మంచి అభ్యర్ధి, క్లాన్ రికార్డున్న వ్యక్తి దొరుకుతారా ?  ప్రతిపక్షాలు ప్రతిపాదించినంత మాత్రాన టాటా అంగీకరిస్తారని కాదు. అసలు ఇలాంటి క్లాన్ రికార్డున్న పారిశ్రామికవేత్తల గురించి వీళ్ళంతా ఎందుకు ఆలోచించటంలేదు ?



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: