ఇక మైనర్ల మీద అత్యాచారాలకు పాల్పడడం వారి న్యూడ్ వీడియోలు తీయడం ఇంకా బ్లాక్ మెయిల్ చేయడం.. ఇంకా సోషల్ మీడియానుపయోగించి బెదిరింపులకు పాల్పడడం ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి ఓ దారుణమైన ఘటన ఇప్పుడు తెలంగాణలో చోటు చేసుకుంది.భువనగిరి జిల్లాలో దారుణ ఘటన అనేది చోటు చేసుకుంది. సంస్థాన్ నారాయణపురం మండంలంలోని కొర్ర తండాలో ఇద్దరు మైనర్ బాలురు దారుణానికి ఒడి గట్టారు. ఇక రెండు రోజుల క్రితం ఇంటి ముందు నిద్రిస్తున్న ఓ మహిళ (40) వస్త్రాలను తొలగించి ఆ ఇద్దరు మైనర్లు.. ఆమె న్యూడ్ ఫోటోలను తీశారు. ఆ తరువాత ఆ ఫొటోలను ఆమెకు చూపించి ఆమెపై బెదిరింపులకు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో వారి స్నేహితులకు షేర్ చేశారు. దీంతో ఆ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.ఇక ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వారిలో ఒక మైనర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇంకా వారిని విచారిస్తున్నట్లు తెలిపారు.ఇక మైనర్లలో పెరుగుతున్న ఈ నేరప్రవృత్తి మీద తల్లిదండ్రులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఇక ఏప్రిల్ 15న ఇలాంటి ఘటనే ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. మత్తు మందు కలిపిన శీతల పానీయాన్ని ఓ ఇంటర్ విద్యార్థిని చేత తాగించి,ఇక ఆమె నగ్న చిత్రాలను ఫోన్లో చిత్రీకరించాడో విద్యార్థి.
ఆ ఫోటోలను సోషల్ మీడియాలో మరో యువకుడు పోస్ట్ చేశాడు. ఈ దారుణంపై ఫిర్యాదు అందడంతో ఇక వారిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు.ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల స్టేషన్ ఎస్ఐ హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం. ఇక పెద్దదోర్నాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన దూదేకుల నాగూర్ మీరావలి (19) డిప్లమా చదువుతున్నాడు. అలాగే మరో గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని స్నేహితురాలు పుట్టినరోజు వేడుకలకు ఇటీవల మార్కాపురంకి వచ్చింది.ఆమెతో అంతకుముందే పరిచయం ఉండడంతో మీరావలి ఆమెని పలకరించాడు. కూల్ డ్రింక్ తాగుదాం అని అతను పిలిచాడు.ఇక అందులో మత్తు మందు కలిపి ఇవ్వడంతో ఆమె తాగిన వెంటనే స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత విద్యార్థినిని వివస్త్రను చేసి ఫోన్ లో ఇక ఆమె నగ్న ఫోటోలను తీశాడు. ఇక ఆ ఫోటోలను చూసిన మీరావలి స్నేహితుడు మెకానిక్ డి. రసూల్ (22) వాటిని సామాజిక మాధ్యమంలో పెట్టడంతో అవి బాగా వైరల్ గా మారాయి. విద్యార్థిని తల్లిదండ్రులు ఇంకా గ్రామస్తులు పెద్ద దోర్నాల పోలీస్స్టేషన్కు చేరుకుని విషయాన్ని తెలిపారు. ఎస్సై సీఐ మారుతీకృష్ణ వారి నుంచి ఫిర్యాదుని తీసుకున్నారు.నాగుర్ మీరావలి ఇంకా అలాగే రసూల్ ను అరెస్టు చేశారు.