రెండేళ్లకే వరల్డ్ రికార్డ్.. బుడ్డోడు ఏం చేసాడో తెలుసా?

praveen
ఇటీవలి కాలంలో చిన్న పిల్లలు ఎంత చురుగ్గా ఉంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఆడుకునే వయసులోనే ఎన్నో అరుదైన రికార్డులు సాధిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఎంతో మంది చిన్నారులు ఇప్పటివరకు తన ప్రతిభతో అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఓ బుడ్డోడు ఇలాంటిదే చేసాడు. సాధారణంగా రెండేళ్ల వయసున్న పిల్లాడికి అప్పుడప్పుడే మాటలు వస్తూ ఉంటాయి. ఇక తల్లి తండ్రి చాటు బిడ్డగా పెరుగుతూ ఉంటాడు.


 తోటి చిన్నారులతో ఆడుకుంటూ ఎంతో సరదాగా గడుపుతూ ఉంటాడు రెండేళ్ళ బాలుడు. కానీ ఇక్కడ మాత్రం రెండేళ్ళ వయసులోనే తనలో దాగివున్న ప్రతిభను బయట పెట్టి ఏకంగా వరల్డ్ రికార్డులు కొట్టేస్తూ ఉన్నాడు. ఈ బుడ్డోడు రెండేళ్లకే హైరేంజ్ సంపాదించి ప్రతి ఒక్కరి నోట వారెవ్వా అని అనిపిస్తూ ఉన్నాడు. దీంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి. బాపట్ల జిల్లా కు చెందిన శివ నాగ ఆదిత్య ఏ టు జెడ్ వరకు క్రమబద్ధంగా ఆంగ్ల అక్షరాలను ఉచ్చరిస్తూ అనుబంధ ఆంగ్లపదాలను చెబుతూ హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నాడు.


 శ్రీనివాస్ సరిత దంపతుల కుమారుడైన ఆదిత్య చిన్నవయసులోనే ఇలా ఆంగ్లపదాలను గుక్కతిప్పుకోకుండా పలుకుతూ ఉండడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఇక తమ కొడుకు ఆంగ్ల పదాలను ఉచ్చరిస్తూ ఉన్నా సమయంలో ఒక వీడియో ని  తీసి హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కి వీడియో పంపించగా.. బాలుడి ప్రతిభను గుర్తించిన హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అతనికి చోటు దక్కింది. ఈ క్రమంలోనే  బాలుడు ప్రతిభకు మంత్రముగ్దులను అయిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి వేణుగోపాల్ ఆ బుడ్డోడి తల్లిదండ్రులను అభినందించారు. ఏదేమైనా రెండేళ్ల బాలుడు ఇలా వరల్డ్ రికార్డు కొట్టడం  అంటే అది ఎంతో గొప్ప విషయం అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: