జనసేనాని పవన్ కళ్యాణ్ మనసులో ఏముందో ఎవరికి ఎరుక ?
అయితే ఇక్కడ పొత్తుల విషయం సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా మారింది. కానీ వాస్తవంగా పవన్ ఎటు వైపు అడుగు వేస్తాడు అన్నది తెలియలేదు. పవన్ బీజేపీ లు కలిసి పోటీ చేస్తారా ? లేక చంద్రన్న తో కలిసి అడుగు వేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. పవన్ బలం ఏమిటి అన్నది ప్రజల్లో ఉంది... అయితే దానికి ముందే బీజేపీ మరియు టీడీపీ లు పవన్ బలాన్ని గట్టిగా నమ్ముతున్నారు. అందుకే పవన్ మా వెంట అంటే.. మా వెంటే అంటూ పాట పాడుతున్నారు. కానీ ఇప్పటి వరకు అధికారికంగా పవన్ ఎవరితో కలిసి ఎన్నికలలో పోటీ చేయనున్నారు అనే విషయం మాత్రం ఖచ్చితంగా తెలియలేదు.
ఇందులో పవన్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా అన్న సందేహంలో ఏపీలో రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. ఎన్నికలు సమీపించే వరకు ఎవరికీ స్పష్టంగా చెప్పకుండా ఏదో పెద్ద ప్లాన్ వేస్తున్నారు అని తెలుస్తోంది. ఎందుకంటే పవన్ నిర్వహించే సభలు, మరియు ఇచ్చే స్పీచ్ ల కారణంగా... జనసేనలో కొత్త శక్తి వచ్చింది అని చెప్పాలి. అందుకే పవన్ ఒంటరిగానే ఎన్నికలకు వెళుతాడా అన్నది తెలియాల్సి ఉంది. అసలు ఇంతకీ పవన్ మైండ్ లో ఏముంది అనేది త్వరలోనే తెలుస్తుంది.