కీవ్ : ఎలక్ట్రానిక్ యుద్ధం దెబ్బకు ఉక్రెయిన్ వణికిపోతోందా ?

Vijaya



ఉక్రెయిన్ పై రష్యా కొత్త తరహా యుద్దాన్ని ప్రారంభించింది. యుద్ధం మొదలైన మూడు నెలల తర్వాత రష్యా హఠాత్తుగా ఉక్రెయిన్ పై ఎలక్ట్రానిక్ యుద్ధం వ్యూహాన్ని మొదలుపెట్టింది. యుద్ధమంటే అందరికీ తెలిసింది సైన్యం, యుద్ధ విమానాలు, షిప్పులే. కానీ కొత్తతరహా ఎలక్ట్రానిక్ యుద్ధం మాత్రం చాలామందికి తెలీదనే చెప్పాలి. ఇంతకీ ఎలక్ట్రానిక్ యుద్ధమంటే ఏమిటి ? సైనిక కమాండర్లు, ప్రముఖుల మొబైల్స్ ను ట్యాపింగ్ చేయటం ద్వారా వాళ్ళెక్కడున్నారో కనుక్కుని వాళ్ళపై మిస్సైళ్ళతో దాడులు చేసి చంపటమే.



మొన్ననే ఉక్రెయిన్ సైన్యంలోని ఒక కమాండర్ కు తన తల్లి దగ్గరనుండి ఫోన్ వచ్చింది. అసిస్టెంట్లు ఫోన్ వచ్చిన విషయం చెప్పగానే వెంటనే కమాండర్ వైర్ లెస్ సెట్ తీసుకుని తన తల్లితో మాట్లాడేందుకు రెడీ అయ్యారు. కమాండర్ వైర్ లెస్ కాల్లోకి వచ్చిన క్షణాల్లోనే ఆయన ఉన్న భవనంపై మిస్సైల్ ఎటాక్ జరిగింది. సదరు కమాండర్ తో పాటు మరికొంతమంది సైనికులు కూడా చనిపోయారు. కమాండర్ వైర్ లెస్ కాల్లోకి ఎలా వచ్చారు ? వెంటనే మిస్సైల్ ఎటాక్ జరగటం ఏమిటో ముందు ఎవరికీ అర్ధంకాలేదు.




తర్వాత అమెరికా సాంకేతిక నిపుణులు రంగంలోకి దిగిన తర్వాత అసలు విషయం బయటపడింది. అదేమిటంటే సదరు కమాండర్ మొబైల్ నెంబర్ ను రష్యా నిఘా విభాగం సంపాదించింది. కమాండర్ తల్లి నుండి ఫోన్ వచ్చినట్లు రష్యా సైన్యమే వైర్ లెస్ కాల్ చేశారు. ఎప్పుడైతే కమాండర్ లైన్లోకి వచ్చారో వెంటనే సదరు కమాండరే మాట్లాడుతున్నారని నిర్దారణ చేసుకున్న వెంటన మిస్సైల్ ఎటాక్ చేశారు. 






తమ దగ్గరున్న అత్యంత ఆధునిక టెక్నాలజీకి, రాడార్లను అనుసంధానం చేస్తున్నది రష్యా. దీనిద్వారా తాము సంపాదించిన కమాండర్ స్ధాయి మొబైల్ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేస్తున్నారు. లైన్లోకి వచ్చింది తమ టార్గెట్లే అని నిర్ధారించుకోగానే రాడార్లు, ద్రోన్ల సమన్వయంతో వెంటనే మిస్సైల్స్ ఎటాక్ చేస్తున్నాయి. యుద్ధం ప్రారంభమైన ఇంతకాలానికి రష్యా తన అమ్ములపొదిలోని శక్తివంతమైన ఎలక్ట్రానిక్ యుద్ధ రీతిని బయటకు తీసింది. దీంతో ఉక్రెయిన్ కమాండర్లు వైర్ లేస్ సెట్లు, మొబైల్ ఫోన్లతో మాట్లాడాలంటేనే వణికిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: