అబ్బాయి లేకుండా పెళ్లి.. గోవాకి హనీమూన్?

praveen
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకం అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  ప్రతి ఒక్కరూ ఒక వయస్సుకు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. ఇటీవలి కాలంలో అయితే ఇక పెళ్లి చేసుకోవడానికి వయస్సు ని కూడా లెక్క చేయడంలేదు. కొంతమంది తొందరగా పెళ్లి చేసుకుంటే మరికొంతమంది కెరియర్ లో సెటిల్ అయ్యే అంతవరకు ఆగాలి అని భావించి.. ఏకంగా 30 ఏళ్లు దాటి పోయిన కూడా పెళ్లి చేసుకోవడం లేదు అన్న విషయం తెలిసిందే. బాగా డబ్బు సంపాదించి సెటిల్ అయిన తర్వాత పెళ్లి అనే కాన్సెప్ట్ ని యాక్సెప్ట్ చేస్తున్నారు అందరు.


 ప్రతి ఒక్కరు కూడా పెళ్ళి విషయంలో కాస్త కమర్షియల్ గానే ఆలోచిస్తున్నారు అని చెప్పాలి. అంతేకాదు ఇక పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా  నచ్చిన వధువు వరుడి ఎంపిక చేసుకుని అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. సాధారణం గా పెళ్లి అంటే వరుడు వధువు ఎంతో అందంగా ముస్తాబై చేసుకుంటారు. ఇక ఇటీవల కాలంలో ఇద్దరు పురుషులు, మహిళలు ఇద్దరు పెళ్లి చేసుకున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.


 కానీ ఇక్కడ ఒక యువతి మాత్రం వరుడు లేకుండానే పెళ్లి చేసుకుంది. అంతేకాదు హనీమూన్ కి కూడా వెళ్ళిపోయింది  షాక్ అవుతున్నారు కదా నిజంగానే ఇదే జరిగింది.. గుజరాత్ కు చెందిన క్షమ బిందు అనే మహిళ జూన్ 11వ తేదీన పెళ్లి చేసుకుంది. అంతేకాదు ఇక పెళ్లి తర్వాత గోవాకి హనీమూన్ కూడా వెళ్లడం గమనార్హం  దేశంలో ఇలా స్వీయ వివాహం జరగడం ఇదే మొదటిసారి అని చెప్పాలి. ఇదేంటి కొత్తగా అని ప్రశ్నిస్తే ఆసక్తికర సమాధానం చెప్పింది. నేనంటే నాకు ప్రేమ..  అందుకే నన్ను నేను పెళ్లి చేసుకున్నాను. ఫ్యామిలీ నుంచి కూడా సపోర్టు ఉంది అంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: