ఆ భూములకు రైతు బంధు క్యాన్సిల్.. ఎందుకంటే?
వేసవి లో వేస్తున్న పంటలకు రైతుకు సాగు సమయంలో పెట్టుబడి ఖర్చుల నిమిత్తం అండగా ఉండాలని ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టింది. ముందు ఓ సీజన్కు ఎకరాకు రూ. 4 వేల చొప్పున వానాకాలం, యాసంగి సీజన్లకు కలిపి రూ. 8 వేలు ఇచ్చింది. ఇప్పుడు సీజన్కు ఎకరాకు రూ. 5 వేలు ఇస్తోంది. అప్పటి నుంచి ఇప్పటివరకు రూ. 50 వేల కోట్లకు పైగా రైతులకు సాయం చేసింది. ఈ ఏడాది యాసంగిలో 1.48 కోట్ల ఎకరాలకు సంబంధించి 63 లక్షల మంది రైతులకు రూ. 7,412 కోట్లు అందజేసింది. 2021-22 వ్యవసాయ సీజన్లో మొత్తం రూ. 14,772 కోట్లు అందజేసింది..అయితే పట్టా ఉన్న రైతులకు మాత్రమే అందజెయాలనే ప్రభుత్వం అనుకోవడంతో ఇలాంటి వాటి పై శ్రద్ద పెట్టలేదు..
పంట పండించే రైతులకు కాకుండా పట్టా ఉండి, వేరే పనులు చెయిస్తున్న భూములకు ఇవ్వడం తగదని, సర్కారు సర్వే నిర్వహిస్తుంది. పంటలను చూసి మాత్రమే పట్టా ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి, వికారాబాద్ సహా అనేక జిల్లాల్లో ఇలాంటివి లక్షలాది ఎకరాలు ఉండొచ్చని అంటున్నారు. ఈ భూములు 10 లక్షల ఎకరాలు వెలుగుచూసినా ప్రభుత్వానికి ఏటా రూ. వెయ్యి కోట్లు ఆదా కానుంది. అయితే రైతుబంధు నిలుపుదలపై మాట్లాడటానికి వ్యవసాయాధికా రులు ఎవరూ సిద్ధంగా లేరు. రైతుబంధు విధాన నిర్ణయం తమ పరిధిలోది కాదని, ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు..విత్తనాలు వేయడానికి సమయం ఆసన్నమైంది.. మరి సర్కారు ఎలా ముందుకు కదులుతుందో చూడాలి..