ఢిల్లీ : పాపం సోనియా..రాహుల్ ?

Vijaya



ఇపుడిదే విషయం చర్చనీయాంశంగా మారింది. తమదాకా వస్తే గానీ నొప్పి తెలీదనే నానుడుంది. అలాగే ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడతారనే సామెత కూడా తెలుగులో చాలా పాపులర్. ఇపుడీ రెండు సామెతలు ఎందుకంటే సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను విచారణకు హాజరుకావాలంటు ఎన్పోర్స్ మెంటు డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీచేసింది. రాహుల్ 2వ తేదీన, సోనియా ఈనెల 8వ తేదీన విచారణకు హాజరవ్వాలంటు ఈడీ నోటీసుల్లో స్పష్టంగా చెప్పింది.



నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తులను అక్రమంగా సోనియా, రాహుల్ సొంతం చేసుకున్నారంటు ఎంపీ సుబ్రమణ్యంస్వామి వీళ్ళద్దరిపైన కేసు వేశారు. కోర్టులో అనేక విచారణలు జరిగిన తర్వాత నేషనల్ హెరాల్డ్ ఆస్తులను తల్లీ, కొడుకులు అక్రమంగా సొంతంచేసుకున్నారనేందుకు తగిన ఆధారాలున్నాయని కోర్టు నిర్ధారించింది. ఇదే విషయమై ఈడీ ఫరదర్ విచారణకు హాజరుకావాలని వీళ్ళద్దరికీ నోటీసులిచ్చింది. విచారణ పేరుతో నోటీసులిచ్చినా బహుశా కొద్దిరోజుల్లో అరెస్టుచేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు.




ఎప్పుడైతే ఈడీ నోటీసులిచ్చిందో వెంటనే కాంగ్రెస్ నేతలు నానా రచ్చ మొదలుపెట్టారు. ఈడీని నరేంద్రమోడి ప్రభుత్వం పెంపుడు సంస్ధగా చూస్తోందట. సోనియా, రాహుల్ పై మనీల్యాండరింగ్ చట్టాన్ని నమోదు చేయటం అన్యాయమంటు నానా గోల చేస్తున్నారు. అయితే ఒకపుడు సోనియాను ధిక్కరించి పార్టీలో నుండి బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డిపైన కూడా అప్పట్లో సోనియా ఇలాంటి కేసులే పెట్టించారు.




సీబీఐ, ఈడీ, ఐటి శాఖలతో జగన్ పైన అనేక కేసులు  పెట్టించి ఏకంగా 16 మాసాలు జైలులో వేయించారు. ఇప్పటివరకు ఒక్క కేసును కూడా నిరూపించలేకపోయినా ఇంకా జగన్ను కోర్టుల చుట్టూ తిప్పుతునే ఉన్నారు. నిజంగానే అవినీతికి పాల్పడుంటే చర్యలు తీసుకోవటంలో తప్పేలేదు. కానీ ఆధారాలు లేకపోయినా కేసులు నమోదుచేసేసి విచారణ పేరుతో మానసికంగా హింసించి జైలులోకి తోసేశారు. అప్పుడు జగన్ కు తాను ఏమి చేశానో ఇపుడు సోనియాకు నరేంద్రమోడి ప్రభుత్వం అదే చేస్తోంది. అప్పట్లో జగన్ కు జరిగింది కరెక్టే అయితే ఇపుడు సోనియా, రాహుల్ కు జరుగుతున్నది కూడా కరెక్టే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: