అమరావతి : పవన్ మూడు రకాలుగా ఇరుక్కుపోయారా ?

Vijaya



జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ పరిజ్ఞానం ఎప్పటికప్పుడు బయటపడుతున్న విషయం అందరు చూస్తున్నదే. విషయపరిజ్ఞానం లేకపోవటం, మాటమీద నిలకడ లేకపోవటంతో, జగన్మోహన్ రెడ్డి అంటే నిలువెల్లా కారంపూసుకున్నట్లు మండిపోతుండటం అందరు చూస్తున్నదే. ఇదే సమయంలో చంద్రబాబునాయుడు రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తున్నాడనే విషయం అందరికీ ఎప్పుడో తెలిసిపోయింది.




అందుకనే మొన్నటి ఎన్నికల్లో పోటీచేసిన రెండుచోట్లా జనాలు ఓడగొట్టారు. అయినా తన పద్దతిలో ఎలాంటి మార్పురాకపోగా మరింతగా రెచ్చిపోతున్నారు. సరే చివరకు ఏమవుతుందనే విషయాన్ని పక్కనపెట్టేస్తే తాజా రాజకీయ పరిణామాల్లో పవన్ మూడురకాలుగా ఇరుక్కుపోయినట్లు అర్ధమవుతోంది. మొదటిదేమో మిత్రపక్షం బీజేపీని కాదని బయటకు వెళ్ళలేని పరిస్ధితి. రెండో విషయం ఏమిటంటే అమలాపురంలో జరిగిన అల్లర్లలో ఎక్కువమంది జనసేనలో పనిచేసే నేతలు, కార్యకర్తలే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో నుండి ఎలా బయటపడాలో పవన్ కు అర్ధం కావటంలేదట. 



మూడో కారణం అంశం ఏమిటంటే మహానాడు సందర్భంగా టీడీపీ పొత్తుగురించి, పవన్ కల్యాణ్ తో కలిసిపనిచేసే విషయాన్ని గురించి మాట మాత్రంగా కూడా ప్రస్తావించలేదు. కనీసం వచ్చే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకోవాలనే తీర్మానం కూడా చేయలేదు. ఎందుకంటే పదిరోజుల క్రితంవరకు పొత్తుల కోసం చంద్రబాబు అర్రులుచాచిన విషయం అందరు చూసిందే. అలాంటిది బాదుడే బాదుడు కార్యక్రమంలో జనాలస్పందన బ్రహ్మాండమని, మహానాడు బహిరంగసభకు లక్షలాది మంది జనాలు వచ్చేశారని చంద్రబాబు ఫుల్లు హ్యాపీగా ఉన్నారట.



జనాల స్పందన చూసినతర్వాత పొత్తులు పెట్టుకునే విషయంలో చంద్రబాబు పునరాలోచనలో ఉన్నట్లు పార్టీలో టాక్ మొదలైంది. అంటే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన సీట్లతో సర్దుకుంటే జనసేనతో కలుస్తుంది టీడీపీ. లేకపోతే ఒంటరిపోటీకే తమ్ముళ్ళు మొగ్గుచూపుతున్నారట. జనసేనకు ఇచ్చే సీట్లన్నీ వృధాఅవుతాయనే వాదన కూడా తమ్ముళ్ళు గట్టిగా వినిపిస్తున్నారట. చూస్తుంటే కోనసీమ హింసాఘటనలు జనసేనను బాగా దెబ్బతీసేట్లుగానే ఉంది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి. క్షేత్రస్ధాయిలో పరిస్ధితుల తర్వాత పవన్ మూడురకాలుగా ఇరుక్కుపోయినట్లు ప్రచారం మొదలైంది.







మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: