షాకిస్తున్న టమోట ధరలు..ఎంతంటే?

Satvika
వామ్మో టమోటా ధరలు ఊహకు అందని విధంగా భారీగా పెరిగి పోతున్నాయి.. రోజు రోజుకు సామన్యులకు షాక్ ఇస్తున్నాయి. మొన్నటి వరకూ కేజీ 10 రూపాయలు ఉన్న ధరలు నేడు మార్కెట్ లో ఒక్కసారిగా భారీగా పెరిగాయి.. ఒకేసారి 80 రుపాయలు కిలో ధర పలుకుతుండటం విశేషం. టమోటాలు లేనిది కూరలు, రసం,రైస్ లు వండలేని పరిస్థితి.. కేవలం వారం, పది రోజుల లోపే ధరలకు రెక్కలు వచ్చాయి.. ప్రస్తుతం ఈ రేటు రూ.80కి పెరిగింది. దీంతో టామోటాలను కొనాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ముందే వంట నూనె ధరలతో పాటు నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్నంటడం తో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న సామాన్యులకు.. తాజాగా టామోటా ధర పెరగడంతో మరింత భారం కానుంది.


తమ నుంచి వ్యాపారులు కిలో రూ.10కి కొని.. ఇప్పుడు తమ వద్ద పంటలేని సమయం లో వ్యాపారులు సిండికేట్‌గా మారిపోయి రూ.80 కి అమ్ముతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు టమోటా ధరలు విపరీతంగా పెరగడానికి కారణం కూడా లేకపోలేదు. రోజు రోజుకు ఎండలు భారీగా పెరగడంతో ధరలు పైకి కదిలాయి.. గతంలో ఉల్లి ధరలు యమ లొల్లి చేశాయి. ఇప్పుడు టమోటా ధరలు కూడా బాగా ఇది చేస్తున్నాయి.


ఎండలు మండిపోతుండటం, పంట వాడిపోతుండటం తో టామోటాలకు భారీ డిమాండ్‌ పెరిగింది. దీంతో వ్యాపారులు రైతుల దగ్గరకు తక్కువ ధరకు కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అటు మదనపల్లి మార్కెట్‌లోనూ టమోటా ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. వారం రోజల కిందట టమోటా రూ.30 నుంచి 35 పలికింది..ఇప్పుడు రంజాన్ సీజన్ కావడం తో ధరలు డబల్ పలుకుతున్నాయి. టమోటాలు పెరగడంతో సాదారణ ప్రజలు కొనడం మానెస్తున్నారు.. మరి కొద్ది రోజుల్లో ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంటూన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: