అమరావతి : రెండు పరీక్షల్లో ఎంతమంది తమ్ముళ్ళు పాసవుతారో ?

Vijaya



తొందరలోనే తమ్ముళ్ళ సంగతి తేలిపోనుంది. వచ్చే నెల 27, 28 తేదీల్లో ఒంగోలులో మహానాడు జరగబోతోంది. అలాగే దానితర్వాత ఎన్టీయార్ శతజయంతి ఉత్సవాలను ఘనంగా జరపాలని చంద్రబాబునాయుడు ఇప్పటికే డిసైడ్ అయ్యారు. శతజయంతి ఉత్సవాలను రాష్ట్రంలోని అన్నీ నియోజకవర్గాల్లోను జరపాలని తమ్ముళ్ళకు చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. మహానాడు నిర్వహణ, శతజయంతి ఉత్సవాలతో  తమ్ముళ్ళ సంగతేంటో తేలిపోతుంది.





ఇక్కడ విషయం ఏమిటంటే 2019 ఎన్నికల్లో ఘోరఓటమి తర్వాత టీడీపీ మళ్ళీ లేవలేదు. ఎంతసేపు ఎల్లోమీడియాను అడ్డంపెట్టుకుని ప్రభుత్వంపై బురదచల్లటం, జగన్మోహన్ రెడ్డిపై జనాల్లో వ్యతిరేకత తీసుకొచ్చే కార్యక్రమాలు మాత్రమే జరుగుతోంది. అందుకనే టీడీపీలోని చాలామంది సీనియర్ నేతలు అసలు పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనటంలేదు. చంద్రబాబు నాయకత్వం మీద అనుమానంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళితే ఏమవుతుందో అన్న భయంతోనే పార్టీకి దూరంగా ఉంటున్నారు.





అలాంటి వాళ్ళంతా ఇపుడు బయటకు వచ్చి పార్టీకి మద్దతుగా నిలబడక తప్పదు. ఎందుకంటే పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమంలో కూడా కనబడకపోతే ఇక వాళ్ళలో అత్యధికులు పార్టీలో లేనట్లుగానే చంద్రబాబు భావిస్తారు. ఇదే విషయమై చంద్రబాబు మాట్లాడుతు మూడేళ్ళుగా పార్టీకి దూరంగా ఉంటున్నవారంతా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారని చెప్పారు. అంటే పార్టీకి దూరంగా ఉంటున్నదెవరు, పార్టీలో యాక్టివ్ గా ఉంటున్నదెవరు అనే విషయాన్ని చంద్రబాబు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు.





మొహమాటపడో, మనస్పూర్తిగానో రేపటి మహానాడు కార్యక్రమంలో సీనియర్లంతా పాల్గొనాల్సిందే తప్ప వేరేదారిలేదు. ఏ కారణంవల్ల వాళ్ళు పాల్గొనకపోయినా వాళ్ళపై పార్టీ ఆశలు వదిలేసుకుంటుంది. అలాగే తర్వాత జరిగే శతజయంతి ఉత్సవాలు కూడా పార్టీకి కీలకమే. ఈ ఉత్సవాలు ప్రతి నియోజకవర్గంలో జరగాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో పార్టిసిపేట్ చేయని సీనియర్లు కూడా పార్టీకి దూరమైనట్లుగానే లెక్కేస్తారు. కాబట్టి పై రెండు కార్యక్రమాలు సీనియర్లకు పెద్ద పరీక్షగా మారబోతోంది. మరీ రెండు పరీక్షల్లో ఎంతమంది పాసవుతారో చూడాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: